Skip to main content

Tech Mahindra Free Training: డిగ్రీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ!

టెక్‌ మహీంద్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు జాబ్‌ ఓరియెంటెడ్‌ నైపుణ్య శిక్షణ.
tech-mahindra-training, Free Skill Training ,Telangana Degree Students

కాగజ్‌నగర్‌ టౌన్‌: టెక్‌ మహీంద్రా ఆధ్వర్యంలోని నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ నేతృత్వంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు జాబ్‌ ఓరియెంటెడ్‌ నైపుణ్య శిక్షణ అందించనున్న ట్లు జిల్లా టూరిజం డెవలప్‌మెంట్‌ అధికారి ఎ.రామకృష్ణ తెలిపారు.

UPSC ESE 2024 Notification: కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా‌..

కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిగ్రీ విద్యార్థుల కోసం ఈ శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం టెక్‌ మహీంద్రా సంస్థ నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ కె.మహేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆయా రంగాల్లో నిపుణులతో త్వరలో ఉద్యో గ నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రిన్సిపాల్‌ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు డి.జనార్దన్‌, దేవేందర్‌, కోటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 13 Sep 2023 03:28PM

Photo Stories