Skip to main content

PGCIL: 10Th, ఐటీఐ, డిప్లొమా అర్హ‌త‌తో 1045 అప్రెంటిస్ ఉద్యోగాలు... జీతం ఎంతంటే...

గుర్‌గ్రాంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL)… 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి.
Power Grid Corporation of India Limited
10Th, ఐటీఐ, డిప్లొమా అర్హ‌త‌తో 1045 అప్రెంటిస్ ఉద్యోగాలు... జీతం ఎంతంటే...

పీజీసీఐఎల్‌ రీజియన్ వారీగా ఖాళీలు:

1. కార్పొరేట్ సెంటర్‌ (గుర్‌గ్రాం)- 53

2. నార్తెర్న్‌ రీజియన్‌-1(ఫరీదాబాద్)- 135

3. నార్తెర్న్‌ రీజియన్‌-2(జమ్ము)- 79

4. నార్తెర్న్‌ రీజియన్‌-III(ల‌క్నో)- 93

5. ఈస్ట్రన్‌ రీజియన్‌-1(పట్నా)- 70

6. ఈస్ట్రన్‌ రీజియన్‌-2(కోల్‌కతా)- 67

7. నార్త్‌ ఈస్ట్రన్‌ రీజియన్‌(షిల్లాంగ్)- 115

8. ఒడిశా ప్రాజెక్ట్స్‌(భువనేశ్వర్)- 47

9. వెస్ట్రన్‌ రీజియన్‌-1(నాగ్‌పుర్)- 105

10. వెస్ట్రన్‌ రీజియన్‌-2(వడోదర)- 106

11. సదరన్‌ రీజియన్‌-1(హైదరాబాద్)- 70

12. సదరన్‌ రీజియన్‌-2(బెంగళూరు)- 105

Central Bank of India: డిగ్రీ అర్హ‌త‌తో 1000 మేనేజర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

Power Grid Corporation of India Limited

మొత్తం ఖాళీలు: 1045.

అప్రెంటిస్‌షిప్ ట్రేడ్‌ విభాగాలు:

గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), 
గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), 
గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్), 
హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, 
ఐటీఐ- ఎలక్ట్రీషియన్, డిప్లొమా (ఎలక్ట్రికల్), 
డిప్లొమా (సివిల్), 
గ్రాడ్యుయేట్ (సివిల్), 
లా ఎగ్జిక్యూటివ్, 
సెక్రటేరియల్ అసిస్టెంట్.

IBPS 2023: డిగ్రీ అర్హ‌త‌తో 4,045 బ్యాంకు క్ల‌ర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

అర్హత: విభాగాన్ని బ‌ట్టి పది, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

18 ఏళ్లు నిండిన వారు అర్హులు

శిక్షణ వ్యవధి: ఏడాది.

స్టైపెండ్: నెలకు రూ.13,500 నుంచి రూ.17,500.

ఎంపిక: అకడమిక్‌ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2023.

మ‌రిన్ని వివ‌రాలకు www.powergrid.in సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Published date : 03 Jul 2023 04:02PM

Photo Stories