Skip to main content

Govt Jobs: ఉద్యోగాల పేరిట మోసం

govt jobs

నిర్మల్‌టౌన్‌: ప్రభుత్వ సంస్థల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసం చేశాడని ఫిర్యాదుతో ఆదివారం కేసు నమో దు చేసినట్లు పట్టణ సీఐ పురుషోత్తం తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. నిజామాబా ద్‌ జిల్లా మాక్లుర్‌ మండలం కొత్తపల్లికి చెందిన రామకృష్ణ, నిర్మల్‌ పట్టణానికి చెందిన పలువురికి ప్రభుత్వ సంస్థల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ప్రియదర్శిని నగర్‌ కాలనీకి చెందిన దీపక్‌, తన స్నేహితులైన ఐదుగురితో రూ.21 లక్షలు ఇప్పించాడు. కొన్ని నెలలు గడుస్తున్నా ఉద్యోగాల విషయంపై స్పందించకపోవడంతో దీపక్‌ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
 

 

Telangana Jobs: 459 మంది వీఆర్‌ఏలకు పోస్టింగ్‌

Published date : 07 Aug 2023 03:20PM

Photo Stories