Telangana Jobs: మహిళా ఆరోగ్యకార్యకర్తల భర్తీ నోటిఫికేషన్ రద్దు చేయాలి
పాతమంచిర్యాల: వైద్య ఆరోగ్యశాఖలో మహిళా ఆరోగ్య కార్యకర్తల భర్తీ నోటిఫికేషన్ రద్దు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల కోరారు. జిల్లాలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంగళవారం వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ 20 ఏళ్లుగా కాంట్రాక్టు ఏఎన్‌ఎంలుగా ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్నామని, తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పు పట్టారు. తాజా నోటిఫికేషన్‌తో తమ ఉ ద్యోగాలకు ముప్పు ఏర్పడిందన్నారు. 20 ఏళ్ల సీని యారిటీ ప్రకారం తమను ఉద్యోగులుగా గుర్తించాల ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ రద్దు చేయకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేస్తామని హె చ్చరించారు. నిరసనలో సెకండ్ ఏఎన్‌ఎంలు తిరుమల, పద్మ, ఆదిలక్ష్మి, సరోజ, సత్యవతి, స్వప్న, సులోచన తదితరులు పాల్గొన్నారు.
Government Medical Association: ‘వైద్యుల సమస్యలు పరిష్కరించాలి’