Job Opportunities: గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు
Sakshi Education
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని ఐటీడీఏ పీఓ ఎం.సూర్యతేజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ, కాడ్‌బరీ చాక్లెట్ తయారీ కంపెనీలో టీమ్ మెంబర్‌గా పని చేసేందుకు ఇంటర్ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. 18 నుంచి 20 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని అన్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఈ నెల 14వ తేదీన కేఆర్‌పురం ఐటీడీఏలో ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. ఉద్యోగంలో సెలక్ట్ అయిన వారికి ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9150015264 నెంబరులో సంప్రదించాలని కోరారు.
Published date : 11 Aug 2023 04:42PM