Guest Lecturers: అతిథి లెక్చరర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లాలోని మహాత్మజ్యోతిబాఫూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాల్లో అతిథి లెక్చరర్లుగా తాత్కాలిక పద్ధతిలో నియామకాని కి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీ నర్ సేరు శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తె లిపారు. గురుకుల కళాశాలల్లో ఫిజిక్స్ బోధన కు జనరల్–1, మహిళలు–2, జువాలజీ బోధనకు మహిళలు–2 పోస్టుల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11 వ తేదీన సోమవారం హాజీపూర్ మండలం గు డిపేటలోని జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ), బీఈడీ పూర్తి చేసి ఉండాలని, అతిథి లెక్చరర్‌గా ఎంపిక డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు 99489 89949, 79934 56620 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు.
చదవండి: ITI Admission 2023-24: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
డిగ్రీ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాఫూలే డిగ్రీ కళా శాలల్లో అడ్మిషన్ల కోసం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గోపిచంద్, మంచిర్యాల జిల్లా కన్వీన ర్ సేరు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎంవీటీసీలో ఖాళీలను భర్తీచేయాలి
మందమర్రిరూరల్: సింగరేణిలోని ఎంవీటీసీ లో ఖాళీ పోస్టులను వెంటనే సీనియర్ స్టాఫ్‌తో భర్తీ చేయాలని సీఐటీయూ మందమర్రి ఏరి యా అధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్ చేశా రు. శుక్రవారం ఏరియాలోని కేకే–5 గనిపై నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. అనంత రం గని మేనేజర్ భూశంకరయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకట స్వామి మాట్లాడుతూ ఎంవీటీసీలో ఏర్పడిన ఖాళీలను యాజమాన్యం సీనియర్‌లతో భర్తీ చే యకుండా ఉద్యోగ విరమణ పొందిన మైనింగ్, టెక్నికల్ ఉద్యోగులతో భర్తీ చేస్తుందని ఆరోపించారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న సీనియర్‌లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు రాజేందర్, శ్రీనివాస్, భరత్, చైతన్యరెడ్డి, శివ ఉన్నారు.
చదవండి: Hyderabad: విద్యార్థి హాస్టళ్లు, పీజీలకు పెరుగుతున్న గిరాకీ