Skip to main content

AP Volunteers: వాలంటీర్లను అవార్డులతో సత్కరించి అభినందించారు..

కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వాలంటీర్లను సత్కరించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ..
Volunteers with Collector and the Officers at collector office

వలంటీర్లు అందిస్తున్న సేవల మూలంగా లబ్ధిదారులందరూ సకాలంలో పథకాలను పొందగలుగుతున్నారని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి ప్రశంసించారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన 9,223 మంది వలంటీర్లను సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటున్న వలంటీర్లను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.

Digital Education: నాడు-నేడుతో విద్యార్థులకు డిజిటల్‌ విద్య..!

గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి మంజులవాణి మాట్లాడుతూ.. వలంటీర్ల పనితీరు, కుటుంబాలు వ్యక్తం చేసిన సంతృప్తి, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాల్లో వారి హాజరు శాతం, ప్రతి నెలా ఒకటో తేదీన శత శాతం పింఛన్‌ పంపిణీ, లబ్ధిదారుల గుర్తింపు వంటి అర్హతలను ప్రమాణాలుగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సేవా వజ్ర 33 మందికి రూ.45,000 చొప్పున రూ.14,85,000, సేవారత్న 135 మందికి రూ.30,000 చొప్పున రూ.40,50,000లు, సేవా మిత్ర 9,055 మందికి రూ.15,000 చొప్పున రూ.13,58,25,000లు మొత్తం 9,223 మందికి రూ.14 కోట్ల 13 లక్షల 60 వేలు చెక్కును అందజేస్తున్నామన్నారు.

Good News For Grama Ward Volunteers : గ్రామ‌/వార్డు వలంటీర్లుల‌కు సీఎం జగన్ వ‌రాలు ఇవే..!

మరో 10 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో వలంటీర్ల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అంతకుముందు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా వలంటీర్ల సన్మాన కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్‌లో వీక్షించారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌, డీఆర్డీఏ పీడీ శచీదేవి, డీఎల్‌డీవో అరుణశ్రీ, ఎంపీపీ జి.సూరిబాబు పాల్గొన్నారు. 

Published date : 16 Feb 2024 12:52PM

Photo Stories