SGT Teachers: ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై కొరడా
సాక్షి,పాడేరు: విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎస్‌జీటీ ఉపాధ్యాయులపై కలెక్టర్ సుమిత్‌కుమార్ కఠిన చర్యలు చేపట్టారు. పెదబయలు మండలంలోని సంపంగిపుట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న కోనాడ విజయలక్ష్మి, రొంగలి శంకరరావులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జులై 17న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సంపంగిపుట్టు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్నిఆయన కలెక్టర్,డీఈవోల దృష్టికి తీసుకువెళ్లారు. ఈనేపథ్యంలో ఉపాధ్యాయుల పనితీరుపై సమ గ్ర విచారణకు డీఈవోను కలెక్టర్ ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారి ఇద్దరు ఎస్‌జీటీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. డీఈవో సమగ్ర విచారణ నివేదిక ను కలెక్టర్‌కు అందించారు. ఉపాధ్యాయుల విధి నిర్వ హణలో నిర్లక్ష్యాన్ని తప్పుబట్టిన కలెక్టర్‌కు వారిని ప్ర భుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు ఎస్‌జీటీలు పాఠశాలకు వెళ్లకుండా, ఓ వలంటీర్ ఏర్పాటు చేసుకుని పాఠశాల నడుపుతున్నారని విచారణలో గుర్తించారు. నాడు–నేడు పాఠశాలల పను లు సక్రమంగా జరగలేదని, పిల్లలకు మధ్యాహ్న భోజ నం అందించడంలోను వారు విఫలమయ్యారని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి పంపిన లేఖలో కలెక్టర్ పేర్కొన్నా రు. సంపంగిపుట్టు పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డీఈవోను కలెక్టర్ ఆదేశించారు.