AI: మరో ఏడేళ్లలో లక్షల ఉద్యోగాలు గల్లంతు... ఈ ఉద్యోగులంతా ఇతర రంగాలవైపు మళ్లాల్సిందేనంటున్న నిపుణులు..!
అమెరికాకు చెందిన ప్రముఖసంస్థ తాజాగా బాంబులాంటి సర్వేను విడుదల చేసింది.
ఓపెన్ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ విశేష ఆదరణ పొందడంతో ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే చాట్‌జీపీటీతో పలు ఉద్యోగాలు కనుమరుగవుతుండగా 2030 నాటికి ఏఐతో లక్షలాది ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయని లేటెస్ట్ సర్వే చెబుతోంది.
ఇవీ చదవండి: ఐటీఐ, డిప్లొమా అర్హతతో అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగాలు.... ఇలా అప్లై చేసుకోండి
ఏఐ టెక్నాలజీతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగవుతాయని, ఆయా కొలువులకు హైరిస్క్ తప్పదని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో జాబ్ మార్కెట్‌పై ఏఐ పెను ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు ఏఐ రాకతో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుందని అంచనా వేసింది.
ఇవీ చదవండి: సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల...
ఆర్ధిక ఆటోమేషన్‌కు ఏఐ దారితీస్తుందని 2030 నాటికి అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో ఏఐ బలీయమైన శక్తిగా అవతరిస్తుందని పేర్కొంది. ఆటోమేషన్, డేటా కలెక్షన్ వంటి ఉద్యోగాలను ఏఐ సమర్ధంగా రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ ఎంప్లాయ్‌మెంట్ వంటి పలు రంగాల్లో ఉద్యోగాలు ఏఐతో ప్రభావితమవుతాయని తెలిపింది.
ఇవీ చదవండి: బిగ్ బ్రేకింగ్... తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల... డీఎస్సీపై క్లారిటీ..!
1,60,000 క్లరికల్ ఉద్యోగాలు, 8,30,000 రిటైల్ సేల్స్‌పర్సన్ ఉద్యోగాలు, ఏడు లక్షలకుపైగా అడ్మిన్ జాబ్స్, ఆరు లక్షలకు పైగా క్యాషియర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని మెకిన్సే అధ్యయనం వెల్లడించింది. 1.8 లక్షల మంది ఉద్యోగులు 2030 నాటికి వేరే జాబ్‌లను వెతుక్కుంటూ విభిన్న రంగాలకు తరలివెళ్లాల్సిన పరిస్ధితి తలెత్తుతుందని అంచనా వేసింది.