JEE Mains 2024: జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన గిరిజన గురుకుల విద్యార్థులు
కళాశాల మొదటి బ్యాచ్‌లోనే విద్యార్థులు ర్యాంకులు సాధించడంపై ప్రిన్సిపాల్ ఈ బలరాం హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఎంపీసీ విద్యార్థులు పి.కిషన్(65.89శాతం), రాహుల్ చౌహాన్(59.67శాతం), కె.అఖిల్(52.13శాతం), కె.నవీన్(49.57శాతం) ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. వీరిని అధ్యాపకులు అభినందించారు.
జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో మరింత ప్రతిభతో మంచి ర్యాంకులు సాధించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల అధ్యాపకుల సహకారంతో విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. ఏప్రిల్‌లో నిర్వహించే అడ్వాన్స్ జేఈఈలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి పాత్లవత్ కిషన్ మాథ్స్‌లో 96శాతం మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకుడు ఏ రమేష్‌ను అభినందించారు.
ఆనందంగా ఉంది
మా కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జేఈఈలో ఉత్తమ మార్కులు సాధించడం సంతోషంగా ఉంది. ప్రత్యేక తరగతులు నిర్వహించి ర్యాంకులు వచ్చేలా ప్రిన్సిపాల్ బలరాం ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
– రమేష్, మ్యాథ్స్ లెక్చరర్
అధ్యాపకుల కృషి
కళాశాల ప్రారంభమైన మొదటి బ్యాచ్‌లోనే నలుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉంది. మరింత పట్టుదలతో ఏప్రిల్‌లో నిర్వహించే అడ్వాన్స్ జేఈఈలో అధిక మార్కులు సాధించాలని కోరుకుంటున్నాం.
– బలరాం, ప్రిన్సిపాల్