Skip to main content

Shocking news to Inter Students: ఐఐటీల్లో ప్రవేశానికి 75% మార్కులు కంప‌ల్స‌రీ... లేదంటే మీకు సీటు రాదు.!

ఇంట‌ర్ స్టూడెంట్స్‌కు ఇది శ‌రాఘాతం లాంటి వార్త‌. ఐఐటీల్లో చ‌దువుకోవాల‌ని క‌ల‌లు క‌నే విద్యార్థులు అక‌డ‌మిక్ ప‌రీక్ష‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా 75 శాతం మార్కులు తెచ్చుకొని తీరాల్సిందే. కొంత‌మంది విద్యార్థులు అక‌డ‌మిక్ ప‌రీక్ష‌లను అల‌స‌త్వం చేసినా పోటీ ప‌రీక్ష‌ల్లో స‌త్తా చాటుతుంటారు. అలాంటి వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
Supreme Court
Supreme Court

ఇక‌పై జేఈఈ లో స‌త్తా చాటినా ఇంట‌ర్‌లో 75 శాతం మార్కులు రాని ప‌క్షంలో సీటు వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

చ‌ద‌వండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో (హయ్యర్‌ సెకండరీ ఎగ్జామినేషన్‌) 75 శాతం మార్కులు వచ్చి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నిబంధన గతం నుంచి ఉందని ఇందులో జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. ‘ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది..ఇప్పుడు దీంట్లో జోక్యం చేసుకోవడం ఎందుకు’ అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

jee

కోవిడ్ స‌మ‌యంలో చాలా రాష్ట్రాల బోర్డులు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. ఈ స‌మ‌యంలో 75 శాతం మార్కుల నిబంధ‌న‌ను తాత్కాలికంగా స‌డలించారు. అయితే ఇదే విధానాన్ని కొన‌సాగించాల‌ని కొంత‌మంది విద్యార్థులు సుప్రీంను ఆశ్ర‌యించారు. సుదీర్ఘ వాద‌న‌లు విన్న కోర్టు ఈ వ్యాజ్యాన్ని కొట్టేసింది. 

➤☛ రెండు కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన హైద‌రాబాదీ అమ్మాయి

iit delhi

పిటిష‌న‌ర్ల‌ త‌ర‌ఫున న్యాయ‌వాదులు వాదిస్తూ... జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ లో వీరు 98 శాతానికి పైగా మార్కులు సాధించారు. వీరు ప్రతిభావంతులైన విద్యార్థులు. దయచేసి వీరిని ప్ర‌వేశాల‌కు అనుమతించండి' అని కోరారు.

students

☛ 2 crore job offer : సాధార‌ణ రైతు బిడ్డ‌... రూ.2 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు

పిటిష‌న‌ర్‌ జేఈఈ మెయిన్స్ లో 92 పర్సంటైల్ సాధించాడని, జేఈఈ అడ్వాన్స్ డ్ కు హాజరయ్యేందుకు అర్హుడని న్యాయవాది తెలిపారు. అయితే బోర్డు ఎగ్జామ్ లో స్కోర్ 75 శాతం కంటే తక్కువగా ఉన్నందున అర్హత సాధించినా విద్యార్థినికి అడ్మిషన్ లభించే అవ‌కాశం లేద‌ని కోర్టుకు విన్న‌వించారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. 

ఈ ఏడాది విడుదల చేసిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ బ్రోచర్ ప్రకారం అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.

Published date : 01 Jun 2023 02:03PM

Photo Stories