Skip to main content

JEE Advanced: అడ్వాన్స్‌డ్‌నూ అధిగమించొచ్చు!.. అర్హత మార్కుల తీరు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వస్తే ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీటు వస్తుందని తెలిసీ, చాలామంది పోటీ పడలేకపోతున్నారు.
JEE Advanced
అడ్వాన్స్‌డ్‌నూ అధిగమించొచ్చు!.. అర్హత మార్కుల తీరు ఇలా..

మెయిన్స్‌ పేపర్‌ కష్టంగా ఉందని, అడ్వాన్స్‌డ్‌ మరింత కష్టంగా ఉంటుందనే భావన వారిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీంతో చాలామంది జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకుతో సరిపెట్టుకుంటున్నారు. ఈ ర్యాంకుతో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో, ట్రిపుల్‌ ఐటీల్లో సీటు కోసం పోటీ పడుతున్నారు. నిజానికి మెయిన్స్‌కు పడే కష్టం, అడ్వాన్స్‌డ్‌కు సైతం కలిసి వస్తుందని సబ్జెక్టు నిపుణులు అంటున్నారు. మెయిన్స్‌లో ఓ మోస్తరు ర్యాంకు సాధించిన ప్రతి వ్యక్తీ కాస్త శ్రద్ధ పెడితే అడ్వాన్స్‌డ్‌లో రాణించడం తేలికే అని చెబుతున్నారు. 

చదవండి: ఐఐటీ- గువహటిలో మౌలిక వసతులు, భోధన విధానం...

తగ్గుతున్న హాజరు.. ఉత్తీర్ణత 

జేఈఈ మెయిన్స్‌ పరీక్ష దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వరకు రాస్తున్నారు. వీరిలో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. అయితే వీరిలో పరీక్ష రాస్తున్న వారు 60 శాతానికి మించి ఉండటం లేదు. ఇలా రాసేవాళ్లలోనూ అడ్వాన్స్‌లో ఉత్తీర్ణులయ్యేవారు 30 శాతం కూడా ఉండటం లేదు. కోవిడ్‌ తర్వాత పరిస్థితి మరీ దిగజారినట్టుగా ఉంటోంది. అర్హత సాధించాం కాబట్టి అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. 2022 జేఈఈ ఫలితాలను పరిశీలిస్తే అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణత 26.17 శాతమే. 2021లో ఇది 29.54 శాతంగా ఉండటం గమనార్హం.  

చదవండి: అన్వయ నైపుణ్యంతో జేఈఈని జయించండిలా..

కోవిడ్‌ ప్రభావమూ కారణమే 

జేఈఈ పరీక్షను గత రెండేళ్ళుగా కోవిడ్‌ వెంటాడుతోంది. 2019 నుంచి 2021 మధ్య కోచింగ్‌కు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్‌ కోచింగ్‌ పెరిగింది. కానీ గ్రామీణ, ఒక స్థాయి పట్టణ కేంద్రాల్లో చదువుకున్న విద్యార్థులు స్థానికేతరులు చెప్పే ఆన్‌లైన్‌ కోచింగ్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. 2022లో కోచింగ్‌ కేంద్రాలు తెరుచుకున్నా, చాలాచోట్ల నాణ్యతలేని ఫ్యాకల్టీ ఉందనే వాదన విన్పిస్తోంది. మరోవైపు కోవిడ్‌ కారణంగా రెండేళ్ళుగా చదువులో వెనుకబడటం కూడా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌పై ప్రభావం చూపించిందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రత్యేక శిక్షణతో ప్రయోజనం 
మెయిన్స్‌లో అర్హత సాధించిన ప్రతిఒక్కరూ అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలి. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి. మెయిన్స్‌లో పడిన కష్టం అడ్వాన్స్‌డ్‌లో చాలావరకు కలిసి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గత కొంత కాలంగా అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత, కటాఫ్‌ తగ్గుతున్నాయి. మరోవైపు ఐఐటీల్లో సీట్లు పెరిగాయి. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు.  
   – ఎంఎన్‌ రావు, జేఈఈ పరీక్షల నిపుణుడు

కొన్నేళ్లుగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత మార్కుల తీరు ఇలా..

కేటగిరీ

2022

2021

2020

2019

2018

2017

జనరల్‌

55

63

69

93

90

128

ఈడబ్ల్యూఎస్‌

50

56

62

83

81

115

ఓబీసీ

50

56

62

83

45

   64

ఎస్సీ

28

31

34

46

45

   64

ఎస్టీ

28

31

34

46

45

   64

పీడబ్ల్యూడీ

28

31

34

46

45

   64

కొన్నేళ్లుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్న, అర్హత సాధిస్తున్న వారి సంఖ్య

సంవత్సరం

అడ్వాన్స్‌డ్‌కు అర్హులు

 హాజరు

2022

2,10,251

1,55,538

2021

2,50,597

1,41,699

2020

2,50,681

1,50,838

2019

2,45,194

1,74,432

2018

2,31,024

1,65,656

2017

2,21,834

1,71,000

Published date : 27 Apr 2023 01:43PM

Photo Stories