Skip to main content

JEE Main: జేఈఈ మెయిన్ అభ్యర్థుల ఆందోళన

ఐఐటీ, ఎన్ ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2021 తుదివిడత ఫలితాలు సెప్టెంబర్‌ 13న కూడా విడుదల కాకపోవడంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
JEE Main
జేఈఈ మెయిన్ అభ్యర్థుల ఆందోళన

ఈ ఫలితాలు ప్రకటించాలి సిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టీఏ) నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగ స్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో జరి గిన 4వ సెషన్ పరీక్షల్లో హరియాణలోని కొ న్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు లీకవడంతో ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొంది. ఈ లీకేజీ కారణంగా దాదాపు ఆరువేలమంది అభ్యర్థులకు అత్యధిక స్కోరు లభించిందని తెలిసింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. అక్రమాలు జరి గినందున 4వ సెషన్ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు యూజీసీ ఆదేశాల ప్రకారం అక్టోబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కావలసి ఉండడంతో ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్‌ 11న ప్రారంభమవుతుందని నిర్వహణ సంస్థ ఖరగ్‌పూర్‌ ఐఐటీ ప్రకటించింది. సెప్టెంబర్‌ 11న కూడా జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల కాకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్‌ 13వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. సెప్టెంబర్‌ 13 రాత్రికి కూడా ఫలితాలు రాకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

చదవండి: 

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్ డ్‌కు దరఖాస్తులు ప్రారంభం... చివరి తేదీ ఇదే!

JEE Main Cut-off RANKS

Published date : 14 Sep 2021 04:45PM

Photo Stories