Skip to main content

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్ డ్‌కు దరఖాస్తులు ప్రారంభం... చివరి తేదీ ఇదే!

ఇండియన్ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్ డ్‌–2021కు ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానుంది.
JEE Advanced
జేఈఈ అడ్వాన్స్ డ్‌కు దరఖాస్తులు ప్రారంభం... చివరి తేదీ ఇదే!

దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్‌ 13న మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ పేర్కొంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 12 నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్ –2021 ఫలితాలు వెలువడక పోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్ డ్‌కు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజును సెప్టెంబర్‌ 20 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు అడ్మిట్‌ కార్డులు సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్ డ్‌ పరీక్ష అక్టోబర్‌ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్‌ 3కు వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పా న్స్ షీట్లు అక్టోబర్‌ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్‌ 10న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్‌ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. 

చదవండి: 

దేశంలోనే బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో చ‌ద‌వాలంటే.. సాధించాల్సిన టాప్‌ ఎంట్రెన్స్‌లు ఇవే..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్‌ సాగించండిలా.. విజయం సాధించండలా..

Published date : 13 Sep 2021 11:59AM

Photo Stories