JEE Exams 2023 : జేఈఈ పరీక్షలపై ఎన్టీఏ స్పష్టీకరణ.. ఈ ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు..
పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ తదితర అంశాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నాయని పేర్కొంది.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
విద్యార్థులను తప్పుదారి పట్టించేలా..
జేఈఈ (మెయిన్) 2023 సెషన్ 2కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు ప్రసారం అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది. అవి ఫేక్. విద్యార్థులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి వీడియోలను నమ్మొద్దు.ఈ వీడియోలను హోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల బారిన పడొద్దు అని మార్చి 30వ తేదీన (గురువారం) ఒక ప్రకటన విడుదల చేసింది. జేఈఈ (మెయిన్) పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.
చదవండి: JEE Main & Advanced: ఏటా తగ్గిపోతున్న అభ్యరులు! కారణాలివే..
అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలను..
సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలు ఎన్టీఏ వెబ్‌సైట్‌లో, పబ్లిక్ నోటీసు ద్వారా మాత్రమే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం 011–40759000 నంబరులో సంప్రదించవచ్చని తెలిపింది. లేదా jeemain@nta.ac.in కు మెయిల్ చేయవచ్చని వివరించింది.
Also read: How To Score Good Percentile In JEE( Mains) 2023 Strategy - Tips