Skip to main content

JEE Mains Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాలటౌన్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2023–24 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్‌–2023 రాసి అర్హత కలిగిన వారికి ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ ఎంట్రన్స్‌కు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ రీజినల్‌ కోఆర్డినేటర్‌ స్వరూపరాణి ఆగ‌స్టు 17న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
JEE Mains Free Training
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

బాలుర కోసం టీటీడబ్ల్యూఆర్‌ ఐఐటీ స్టడీ సెంటర్‌, రాజేంద్రనగర్‌, బాలికల కోసం టీఎస్‌డబ్ల్యూఆర్‌ సీవో ఈ గౌలిదొడ్డి, హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

www. tgtwgurukulam. telangana. gov. in, www. tswreis. ac. in వెబ్‌సైట్‌ల నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని ఆర్సీవో కార్యాలయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.దరఖాస్తు రుసుం రూ. 200లను సెక్రెటరీ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, హైదరాబాద్‌ గానీ సెక్రటరీ టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, హైదరాబాద్‌ పేరున డీడీ తీసి ఈ నెల 19 లోగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు.

Published date : 18 Aug 2023 05:36PM

Photo Stories