JEE Mains 2024: జేఈఈ మెయిన్స్ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
నవంబర్ 30 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 1వ తేదీన మొదలైంది.
జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరుగుతుంది. రెండోవిడత ఏప్రిల్‌లో జరుగుతుంది. ఫిబ్రవరి 12న మెయిన్స్ ఫలితాలు వెల్లడిస్తారు.
చదవండి: JEE Mains 2024: వీలైనంత దగ్గరగా జేఈఈ పరీక్ష కేంద్రం
కోవిడ్‌కాలంలో ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ సిలబస్ తగ్గించారు. దీంతో ఈసారి కొన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడాన్ని మినహాయించినట్టు ఎన్‌టీఏ ప్రక టించింది. ఇందుకు సంబంధించిన సిలబస్‌నూ విడుదల చేసింది.
మ్యాథ్స్‌లో కూడా సుదీర్ఘ జవాబులు రాబట్టే విధానానికి సడలింపు ఇచ్చారు. ఫలితంగా ఈసారి ఎక్కువమంది మెయిన్స్ రాసే వీలుందని అంచనా వేస్తున్నారు.
చదవండి: JEE Mains 2024: లాజిక్ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్ కొట్టు!