ఇంటర్ ఫిజిక్స్ ప్రాక్టికల్ పరీక్షలకు సూచనలు
Sakshi Education
ఫిజిక్స్ ప్రాక్టికల్స్ 30 మార్కులకు ఉంటాయి. వీటిని మొత్తం మార్కులకు కలుపుతారు. తేలికైన విధానాన్ని అనుసరించడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు.
క్యాలిక్యులేషన్స్, ఫలితం, యూనిట్లు:
| అంశం | మార్కులు |
1. | ఫార్ములా, ప్రొసీజర్ | 2+3 = 5 |
2. | టాబ్యులర్ ఫాం, అబ్జర్వేషన్స్, గ్రాఫ్ | 2+4+2 = 8 |
3. | కాలిక్యులేషన్స్, రిజల్ట్, యూనిట్లు | 4+1+1 = 6 |
4. | ప్రికాషన్స్ | 2 |
5. | వైవా | 5 |
6. | రికార్డు | 4 |
| మొత్తం | 30 మార్కులు |
- ఇంటర్ రెండేళ్ల కాలంలో 20 ప్రయోగాలు చేస్తారు. వీటి ఆధారంగా ప్రాక్టికల్ పరీక్షలో ప్రశ్నలు వస్తాయి.
- ఎక్స్‌టెర్నల్ ఎగ్జామినర్ సమక్షంలో విద్యార్థి ఒక ప్రాక్టికల్‌ను 3 గంటల వ్యవధిలో చేయాలి.
- పయోగాన్ని కేటాయించిన తర్వాత విద్యార్థి తొలి అర్ధ గంటలో థియరీ పార్ట్ రాసి, ఎగ్జామినర్‌కు చూపిస్తే అప్పుడు పరికరం ఇస్తారు.
- తొలుత సూత్రాన్ని రాసి, అందులోని పదాలను తప్పనిసరిగా వివరించాలి.
- పది వాక్యాలకు మించకుండా ప్రయోగ విధానం రాయాలి. పరికరం వర్ణన రాయనవసరం లేదు.
- గాఫ్స్ అవసరమైతే నమూనా గ్రాఫ్‌లను గీయాలి. ప్రయోగ సమయంలో పరిశీలించిన అంశాలను విడిగా రాయాలి.
క్యాలిక్యులేషన్స్, ఫలితం, యూనిట్లు:
- పయోగం నిర్వహించిన తర్వాత వచ్చిన విలువ ఫలితం.దీనికి యూనిట్లను తప్పనిసరిగా రాయాలి.
- పయోగ సమయంలో తీసిన రీడింగ్స్‌ను పట్టకలో పొందుపరచాలి.
- పయోగ సమయంలో పొందిన విలువలను సూత్రంలో ప్రతిక్షేపించి, తుది ఫలితం పొందాలి.
- వైవా: ప్రయోగ పరీక్ష సమయంలో ఎక్స్‌టెర్నల్ ఎగ్జామినర్ విద్యార్థిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రయోగానికి సంబంధించి కనీసం 5 ప్రశ్నలు అడుగుతారు. వీటికి విద్యార్థి సమాధానాలు చెప్పాలి. సూటిగా సమాధానాలు చెప్పడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు.
- రికార్డులు: పరీక్ష గదికి రికార్డు తీసుకెళ్లాలి. దీనికి నాలుగు మార్కులుంటాయి.
- డి.శివకుమార్, శ్రీచైతన్య విద్యాసంస్థలు.
Published date : 28 Jan 2016 02:21PM