విద్యార్థులు పెరిగారు.. ఉత్తీర్ణత తగ్గింది
Sakshi Education
సాక్షి, అమరావతి: 2018 సంవత్సరంలో ఇంటర్ ద్వితీయలో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. ఏప్రిల్ 12న ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాలను, గతంలోని ఫలితాలను విశ్లేషిస్తే ఈ అంశం స్పష్టమవుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత 2015లో 72, 2016లో 74, 2017లో 77 శాతం ఉత్తీర్ణత ఉండగా ఈ ఏడాది 73 శాతానికి పడిపోయింది. జనరల్ ఇంటర్‌లోనే కాకుండా వొకేషనల్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది.
భారీగా పెరిగి ఏగ్రేడ్ విద్యార్థులు
ఇలా ఉండగా 2018 సెకండియర్‌లో గత ఏడాది (2017)కన్నా ఉత్తీర్ణత శాతం తగ్గినా ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య మాత్రం పెరిగింది. పాసైన 3,23,645 మంది విద్యార్థుల్లో 75 శాతానికి పైగా మార్కులు సాధించి ఎ-గ్రేడ్ పొందిన వారు 1,97,183 మంది ఉన్నారు. 60 నుంచి 70 శాతం మార్కులతో బి-గ్రేడ్‌లో 84,690 మంది, 50 నుంచి 60 మార్కులతో సి- గ్రేడ్‌లో 32,240 మంది, 35 నుంచి 50 మార్కులతో డి-గ్రేడ్‌లో 9,532 మంది ఉన్నారు.

ఏడాది | విద్యార్ధులు | ఉత్తీర్ణత | శాతం |
2015 | 403496 | 290789 | 72 |
2016 | 411941 | 303934 | 74 |
2017 | 429586 | 330986 | 77 |
2018 | 441359 | 323645 | 73 |
Published date : 13 Apr 2018 06:39PM