Skip to main content

Intermediate Exams 2022: మొబైల్‌ యాప్‌ ద్వారా సెంటర్‌ లొకేషన్‌

perfect arrangements for exams
perfect arrangements for exams
  •      కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కేంద్రాల ఎంపిక 
  •       సింగిల్‌ బెంచీకి ఒక్కరే...పెద్ద బెంచీకి ఇద్దరు విద్యార్థులు 
  •      సీసీ కెమెరాలతో నిఘా  
  •      మొబైల్‌ యాప్‌ ద్వారా సెంటర్‌ లొకేషన్‌ గుర్తింపు   
  •      గ్రేటర్‌ పరిధిలో 517 పరీక్ష కేంద్రాలు, 3,76,245 మంది విద్యార్థులు 

సాక్షి, సిటీబ్యూరో: వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగనున్న ఇంటరీ్మడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు  పూర్తి చేసింది. కరోనా నిబంధనలు, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.  

Also read: New courses: ఇంటర్‌ కాలేజీల్లో స్వల్పకాలిక కోర్సులు

  • పరీక్ష కేంద్రంలో గాలి, వెలుతురు ఉన్న గదులకు మాత్రమే అనుమతిస్తూ సింగిల్‌ బెంచీ (మూడు ఫీట్లు)కి ఒకరు, పెద్ద బెంచీ (ఐదు ఫీట్లు)కి ఇద్దరు విదార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.  
  • విద్యార్థులకు మాసు్కలు తప్పనిసరి. పరీక్ష కేంద్రంలో విద్యుత్,  తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్స్, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. డీహైడ్రేషన్‌ నుంచి రక్షించేందుకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను 
  • అందుబాటులో ఉంచతున్నారు.  
  • పరీక్ష కేంద్రంలోని గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయిస్తున్నారు. ప్రతి గదిలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణ తీరు పర్యవేక్షించనున్నారు.  
  • విద్యార్థులు పరీక్షే కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు మొబైల్‌ యాప్‌ ద్వారా సెంటర్‌ లొకేషన్‌ గుర్తింపు ప్రక్రియకు వెసులుబాటు కలి్పంచారు. రెండు, మూడు రోజుల్లో మొబైల్‌ యాప్‌ వివరాలను బోర్డు అధికారులు ప్రకటించనున్నారు.  

Also read: Internet: మెరుగైన సైబర్‌ ప్రపంచ దిశగా!
3.76 లక్షల మంది 

  • గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 3,76,245 మంది పరీక్షకు హజరు కానున్నారు.  
  • ఇందుకోసం సుమారు 517 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  
  • హైదరాబాద్‌ జిల్లాలో ఫస్టియర్, సెకండియర్లో కలిపి 153,119 మంది, రంగారెడ్డి జిల్లాలో 115,366 మంది, మేడ్చల్‌ జిల్లాలో 1,07,760 మంది పరీక్షలకు హజరు కానున్నారు. 
  • ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున నియమిస్తున్నారు. సెంటర్‌ ఒకరు చొప్పున డిపార్ట్‌మెంట్‌ అధికారులను, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ప్రైవేటు విద్యా సంస్ధల కేంద్రాలకు అదనంగా అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించారు. 
     
Inter exam centers

 

Published date : 30 Apr 2022 04:01PM

Photo Stories