New courses: ఇంటర్ కాలేజీల్లో స్వల్పకాలిక కోర్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో స్వల్పకాలిక కొత్త సర్టిఫికెట్ కోర్సులను అందించాలని బోర్డు నిర్ణయించింది. ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జూలై నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సులు 3 నుంచి 9 నెలల వ్యవధిలో ఉంటాయని పేర్కొన్నారు. టజీఠ్ఛి.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందవచ్చని వెల్లడించారు. ఈ కోర్సులకు రూ. 600 నుంచి 1,200 వరకూ ఫీజు ఉంటుందని బోర్డు అధికారులు తెలిపారు. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్(కోర్సు) 6 (నెలలు) ఎస్సెస్సీ (అర్హత); హాస్పిటల్ మేనేజ్‌మెంట్, 9, ఎస్సెస్సీ; రెస్పిరేటరీ టెక్నీషియన్, 3, ఎస్సెస్సీ (పాస్, ఫెయిల్); ప్లబాటమీ (శాంపుల్ కలెక్షన్), 3, ఎస్సెస్సీ; ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, 6, 8వ తరగతి; వీడియోగ్రఫీ, ఎడిటింగ్, 6, 8వ తరగతి; సీసీటీవీ, మొబైల్ ఆపరేషన్స్, 3, ఎస్సెస్సీ (పాస్, ఫెయిల్); సోలార్ లైటెనింగ్ టెక్నాలజీ, 3, ఇంటర్; ఇండ స్ట్రియల్ రోబోట్, 3, ఇంటర్; బేసిక్ పాట్రన్ మేకింగ్ (టైలరిం గ్), 3, ఎస్సెస్సీ (పాస్, ఫెయిల్); మెహందీ డిజైనింగ్, 3, 8వ తరగతి; ఫ్యాబ్రిక్ పెయింటింగ్, 3, 8వ తరగతి; ఫుల్ స్టాక్ వెబ్ డిజైనింగ్, 3, ఇంటర్; ఫుల్‌స్టాక్ వెబ్–3, 3, ఇంటర్‌తో ఎఫ్‌ఎస్ డబ్ల్యూడీ; డేటా ఎనలిటిక్స్, 3(నెలలు), ఇంటర్ (అర్హత).
Also read: Education Sector: కలలో కూడా ఊహించని మహర్దశ