Intermediate Education: విద్యార్థులకు నాణ్యమైన బోధన కల్పించాలి
సాక్షి ఎడ్యుకేషన్: బాలల హక్కుల ఉల్లంఘన జరిగితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ గొండు సీతారాం హెచ్చరించారు. ‘బాలల హక్కుల పరిరక్షణలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్ పాత్ర’అనే అంశంపై బుధవారం విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఏవీఎన్ కాలేజీలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జి.సీతారాం మాట్లాడుతూ ఐఐటీ, జేఈఈ అనే భ్రమలను కల్పించి, నగరంలోని కొన్ని కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నట్లు కమిషన్‌కు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయడం వారి హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
Polytechnic Admissions: స్పాట్ అడ్మిషన్లు పూర్తి
ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించడానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కాలేజీల గుర్తింపు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రాయల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు విద్యార్థులకు నాణ్యమైన చదువులు చెప్పాలన్నారు. అధ్యాపకులు వృత్తి నైపుణ్యత పెంచుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాల బోధన చేయాలన్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏవీఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు రమేష్, శ్రీలత, ఉమ్మడి విశాఖ జిల్లాలోని జూనియర్ కాలేజీలకు చెందిన సుమారు 200 మంది ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.