Job Opportunities: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్ చదువుతో పాటు ఉద్యోగావకాశాలు
రాయవరం: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్ చదువుతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. దీనిపై ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని కళాశాలలను హెచ్‌సీఎల్ టెక్‌బీ బృందాలు సందర్శించి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయని వివరించారు. ఇందులో విద్యార్థులందరూ పాల్గొని, రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హెచ్‌సీఎల్‌టెక్‌బీ.కామ్ లేదా సాయి కిరణ్ – 96429 73350, గురునాథ్ 77807 54278, యోగేష్ 63003 78377 నంబర్లలో సంప్రదించవచ్చునని ఆయన సూచించారు.
చదవండి: Free Coaching : ఉచిత సివిల్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి
విద్యార్థినికి రూ.40 వేల సాయం
అమలాపురం రూరల్: కష్టాల్లో ఉన్న ఓ విద్యార్థినికి ‘సేవ్ ద పీపుల్ ఆర్గనైజేషన్’ కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా శుక్రవారం రూ.40 వేల విరాళం అందించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రామచంద్రపురం మండలం నరసాపురపుపేట గ్రామానికి చెందిన రెడ్డి రాజరాజేశ్వరి పదో తరగతిలో అత్యధిక మార్కులతో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఉచితంగా సీటు సాధించిందని చెప్పారు. శ్రీకాకుళంలో చదువుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులిద్దరూ మరణించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని అవసరాల నిమిత్తం సేవ్ ద పీపుల్ సంస్థ ఈ మొత్తాన్ని అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు. సేవ్ ద పీపుల్ సంస్థ ఆధ్వర్యాన ఇప్పటి వరకూ 34 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం అందించారని చెప్పారు. కార్యక్రమంలో సేవ్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తిరుమలరావు, నవ్య, దుర్గ, సుమ, రమ్య, గణేష్, రమేష్, లక్ష్మి పాల్గొన్నారు.