Free Coaching : ఉచిత సివిల్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి
Sakshi Education
చింతూరు: స్థానిక ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత సివిల్స్ శిక్షణను గిరిజన నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య నవంబర్ 16 గురువారం తెలిపారు. నవంబర్ 21 వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 26వ తేదీన మొదటి దశ పరీక్ష నిర్వహించిన 28న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. వచ్చేనెల 3వ తేదీన రెండవ దశ పరీక్ష నిర్వహించి ఐదవ తేదీ ఫలితాలు వెల్లడించి 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. వీరిలో 75 మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. వీరికి తొమ్మిది నెలల పాటు ఐటీడీఏ ద్వారా సివిల్స్ ప్రత్యేక శిక్షణ ఇస్తామని పీవో పేర్కొన్నారు.
చదవండి: UPSC Preparation Without Coaching: కోచింగ్ లేకున్నా.. సక్సెస్ ఇలా!
Published date : 17 Nov 2023 03:01PM