Skip to main content

Indian‌ Economy for Group 1 & 2: భారత ఆర్థిక సర్వే 2021–22

Indian‌ Economic Survey of India 2021–22
Indian‌ Economic Survey of India 2021–22

గత రెండు సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19 వైరస్‌ వివిధ దశలు, ప్రయాణ నియంత్రణలు, ప్రపంచ ద్రవ్యోల్బణం వంటి వాటితో విధాన రూపకల్పన క్లిష్టతరమైంది. అనిశ్చితి నేపథ్యంలో భారత ప్రభుత్వం బార్బెల్‌ వ్యూహాన్ని ఎంచుకొంది. ఈ వ్యూహం సమాజంలో బలహీన వర్గాల ప్రజలతోపాటు వ్యాపార రంగంపైనా అనిశ్చిత ప్రభావాన్ని తగ్గించడానికి భద్రత వలయాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యంపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ.. 2020–21పూర్తి లౌక్‌డౌన్‌ దశలో.. కోవిడ్‌ రెండో దశ(సెకండ్‌ వేవ్‌)ఆర్థిక ప్రభావం చాలా తక్కువగా నమోౖ§ð ంది. అవస్థాపన సౌకర్యాలపై మూలధన వ్యయం పెంపుతోపాటు సప్లయ్‌ వైపు చర్యలను చేపట్టి..సుస్థిర,దీర్ఘకాల విస్తరణ దిశగా ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం సన్నద్ధం చేసింది. 
కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటంకాలు ఎదురయినప్పటికీ.. గత రెండేళ్లుగా భారత వ్యాపార చెల్లింపుల శేషంలో మిగులు ఏర్పడింది. డిసెంబర్‌ 31,2021 నాటికి భారత్‌లో విదేశీ మారక నిల్వలు 634 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యత్వం 2022–23లో క్రమంగా తగ్గుముఖం పడుతుందనే అంచనాల నేపథ్యంలో.. దీనిని ఎదుర్కొనే విధంగా భారత్‌ అధిక విదేశీ మారక నిల్వలు, సుస్థిర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు,ఎగుమతుల రాబడిలో పెరుగుదలను సాధించే స్థితిలో ఉండగలదని ఆర్థిక సర్వే పేర్కొంది. 2022–23లో భారత విదేశీ మారక నిల్వలు 13.2 నెలల వస్తు దిగుమతులకు సమానంగా ఉండటంతోపాటు దేశ బహిర్గత రుణం కంటే అధికమని ఆర్థిక సర్వే పేర్కోంది.

పెరిగిన రాబడి

ఆర్థిక వ్యవస్థకు విత్త మద్దతు, ఆరోగ్య రంగంపై ప్రభుత్వ అధిక వ్యయం కారణంగా.. 2020–21 లో ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణంలో పెరుగుదల ఏర్పడింది. ప్రభుత్వ రాబడి 2021–22లో పెరిగిన కారణంగా..ప్రభుత్వం తన లక్ష్యాలను సాధించడంతోపాటు మూలధన వ్యయాన్ని పెంచుకోగలిగే స్థితికి చేరిందని ఆర్థిక సర్వే పేర్కొంది. కల్లోల సమయాలలో విత్త వ్యవస్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కానీ ప్రపంచలోని అనేక మార్కెట్ల మాదిరి భారత మూలధన మార్కెట్‌ పనితీరు మెరుగుపడటంతోపాటు భారతీయ కంపెనీలు రిస్క్‌ కాపిటల్‌ను సమీకరించుకోవడానికి అనుమతిచ్చింది. అభివృద్ధి చెందిన,వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం అధికంగా ఉండటాన్ని సర్వే ప్రస్తావించింది.2022–23లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే విధంగా భారత స్థూల ఆర్థిక స్థిర సూచికల పటిష్టతను సర్వే పేర్కొంది.

Economy Preparation Strategy: పోటీ పరీక్షల్లో–భారత ఆర్థిక వ్యవస్థ

సప్లయ్‌ వైపు సంస్కరణలు

దేశంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవడానికి డిమాండ్‌ నిర్వహణపై అధికంగా ఆధారపడకుండా.. సప్లయ్‌ వైపు సంస్కరణలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అనేక రంగాలలో నియంత్రణల సడలింపు, ప్రక్రియలను సరళీకరించడం, రెట్రోస్పెక్టివ్‌ టాక్స్‌ తొలగింపు, ప్రైవేటీకరణ, ఉత్పత్తి–సంబంధిత ప్రోత్సాహకాలను సప్లయ్‌ వైపు సంస్కరణలుగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ మూలధన వ్యయంలో పెరుగుదల, భవిష్యత్తు వృద్ధికి అవస్తాపన సామర్థ్యాన్ని పెంచుతున్నందున.. మూలధన వ్యయంలో పెరుగుదల..డిమాండ్,సప్లయ్‌లో పెరుగుదలకు కారణమవుతుందని సర్వే పేర్కొంది.

వివిధ రంగాల ధోరణులు

కోవిడ్‌ మహమ్మారి సంబంధిత ఆటంకాల ప్రభావం వ్యవసాయం రంగంపై తక్కువగా ఉంది. 2020–21లో వ్యవసాయ రంగం వృద్ధి 3.6 శాతంగా నమోదయింది. 2021–22లో మొదటి ముందస్తు అంచనాల ప్రకారం–వ్యవసాయ రంగ వృద్ధి 3.9 శాతంగా సర్వే పేర్కొంది. స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయ రంగం వాటా 18.8శాతం. 2020–21తో పోల్చినప్పుడు 2021–22లో ఖరీఫ్‌ కాలంలో సాగు విస్తీర్ణం అధికం. సాగు విస్తీర్ణం ఇదే కాలంలో 732 లక్షల హెక్టార్‌ల నుంచి 743 లక్షల హెక్టార్‌లకు పెరిగింది. 2021–22 ఖరీఫ్‌ కాలంలో ఆహార «ధాన్యాల ఉత్పత్తి 150.5మిలియన్‌ టన్నులుగా నమోదయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలకు రుతుపవనాల అనుకూలతతోపాటు గత పది సంవత్సరాల సగటు కన్నా రిజర్వాయర్లలో నీటి మట్టం అధికంగా ఉండటం కారణమయింది. అధిక మద్దతు ధరల వద్ద 2021–22లో కేంద్రం ఆహార ధాన్యాలను సేకరించింది. దీంతో ∙జాతీయ ఆహారభద్రత పథకం అమలుకు అవసరమైన నిల్వలతో పాటు రైతుల ఆదాయాలలోనూ పెరుగుదల ఏర్పడింది. సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా లాంటి విధానాలు కూడా వ్యవసాయరంగ పట్టిష్టతకు దోహదపడ్డాయి.

2020-21 కేంద్ర బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారు?

పారిశ్రామిక ఒడిదుడుకులు

  • ప్రాథమిక రంగంలో స్థిరమైన ప్రగతి కొనసాగినప్పటికీ.. పారిశ్రామిక రంగ ప్రగతిలో ఒడిదుడుకులను గమనించవచ్చు. గత రెండేళ్లుగా రుణాత్మకవృద్ధి నమోదు చేస్తున్న పారిశ్రామిక రంగం.. 2021–22లో మొదటి ముందస్తు అం^è నాల ప్రకారం–11.8 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలదని సర్వే పేర్కొంది.
  • స్థూల కలుపబడిన విలువలో పారిశ్రామిక రంగం వాటా 2021–22లో 28.2శాతం. గత రెండు సంవత్సరాలతో పోల్చినప్పుడు మైనింగ్,క్వారియింగ్, తయారీరంగం, నిర్మాణరంగాల్లో వృద్ధి అధికంగా ఉండటాన్ని మొదటి ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి.
  • జనవరి 2021 తర్వాతి కాలంలో తయారీరంగానికి సంబంధించి పర్చేజింగ్‌ మేనేజింగ్‌ ఇండెక్స్‌లో మే నెల మినహా మిగతా అన్ని నెలల్లోనూ పెరుగుదలను గమనించవచ్చు. కోవిడ్‌ రెండవ దశ(సెకండ్‌ వేవ్‌) కారణంగా.. ఆర్థిక కార్యకలపాలు సన్నగిల్లడం దీనికి కారణమయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, కోర్‌ ఇండస్ట్రీ ఇండిసిస్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది. అవస్థాపన రంగంపై ప్రభుత్వం అధిక వ్యయం కారణంగా నిర్మాణ రంగం పురోగమించింది. తద్వారా ఉక్కు, సిమెంట్‌ వినియోగం, ఉత్పత్తి.. కోవిడ్‌ ముందు కాలం స్థాయికి చేరింది. రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) అధ్యయనం ప్రకారం– ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ‘ఇండియన్‌ రెసిడెన్షియల్‌ రియల్‌ మార్కెట్‌ 2021’లో అమ్మకాలు, ధరలు,నూతన ప్రారంభాలకు సంబంధించి అధిక పురోగతి సాధించాయి.

సేవల రంగంపై అధికంగా 

కోవిడ్‌–19 సంబంధిత నియంత్రణలు సేవల రంగంపై అధిక ప్రభావాన్ని చూపించాయి. 2020–21లో ఈ రంగంలో రుణాత్మక వృద్ధి నమోదుకాగా.. 2021–22లో వృద్ధి 8.2శాతంగా సర్వే పేర్కొంది. స్థూల కలుపబడిన విలువలో ఈ రంగం వాటా 2021–22లో 53 శాతం. ఫైనాన్స్, రియల్‌ ఎస్టేట్, ప్రభుత్వ పాలన రంగాలలో కోవిడ్‌ ముందుకాలం కంటే.. 2021–22లో అధికవృద్ధి నమోదయింది. కాగా,ప్రయాణం, వర్తకం, హోటళ్లు లాంటి రంగాలు పురోగమించాల్సిన ఆవశ్యకతను సర్వే పేర్కొంది. ఆగస్ట్‌ 2021 తదుపరి కాలంలో సేవారంగానికి సంబంధించి ³ర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌లో పట్టిష్టమైన పురోగతి నమోదయింది. రిటైల్, వినోదానికి సంబంధించి ‘ప్రపంచ చలనశీలత సూచికల’లోనూ.. పురోగతి ఏర్పడింది. సాఫ్ట్‌వేర్, ఐటీ సంబంధిత ఎగుమతులలో వృద్ధి నమోదుకాగా పర్యాటక రంగ రాబడులలో తగ్గుదల నమోదయింది. 

Telangana Economy For Groups Exams: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.. వ్యవసాయ రంగం వాటా..

ఆర్థిక వృద్ధి

2017–18 ఆర్థిక సంవత్సరంలో 7శాతం వృద్ధి నమోదు చేసుకున్న భారత ఆర్థికవ్యవస్థలో.. తర్వాతి కాలంలో వృద్ధి మందగించింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు సన్నగిల్లి.. 2020–21లో రుణాత్మక వృద్ధి నమోౖ§ð ంది. 2020–21 ఆర్థిక సంవత్సరం రెండవఅర్ధ భాగం నుంచి పురోగతి ప్రారంభమైందని సర్వే పేర్కొంది. ముందస్తు అంచనాల ప్రకారం–2021–22 స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 9.2 శాతంగా అంచనా. వాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింపు, సప్లయ్‌ వైపు సంస్కరణల అమలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి 2022–23లో భారత్‌ 8–8.5శాతం వృద్ధి సాధనకు దోహదపడగలవని సర్వే పేర్కొంది. ప్ర పంచ బ్యాంకు,ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు 2021–23వృద్ధి అంచనాల ప్రకారం–ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా నిలిచిందని ఆర్థిక సర్వే పేర్కొంది.

డిమాండ్‌ ధోరణులు

ముందస్తు అంచనాల ప్రకారం– 2021–22 ప్రైవేట్‌ వినియోగం మినహా, మిలిగిన డిమాండ్‌ వైపు అన్ని కారకాలలో పురోగతి ఏర్పడింది. కోవిడ్‌ ముందు కాలంతో పోల్చినప్పుడు ఎగుమతులు, ప్రభుత్వ వినియోగం, స్థూల స్థిర మూలధన కల్పనలో పురోగతి అధికమని సర్వే పేర్కొంది. వాస్తవిక సాంవత్సరిక వృద్ధి జీడీపీలో భాగంగా 2021–22లో ప్రభుత్వ వినియోగంలో 7.6శాతం, ఎగుమతులలో 16.5శాతం, స్థూల స్థిర మూలధన కల్పనలో15శాతంగా నమోదయింది. మొత్తం వినియోగంలో 7శాతం వృద్ధి నమోదుకావడానికి ప్రభుత్వ వినియోగంలో వృద్ధి అధికంగా ఉండటం కారణమైంది. వాక్సినేషన్‌ కవరేజ్‌ అధికంగా ఉండటం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరడం.. ప్రైవేట్‌ వినియోగంలో పెరుగుదలకు దోహదపడ్డాయని సర్వే పేర్కొంది.
పెట్టుబడిని కొలిచే స్థూల స్థిర మూలధన కల్పనలో వృద్ధి 2021–22లో 15శాతంగా సర్వే పేర్కొంది. కోవిడ్‌ ముందు కాలం నాటి స్థాయికి స్థూల స్థిర మూలధన కల్పన చేరింది. అవస్థాపనరంగంపై మూలధన వ్యయం పెరుగుదల కారణంగా పెట్టుబడి–జీyీ పీ నిష్పత్తి 2021–22లో 29.6 శాతంగా నమోదయింది. గత ఏడు సంవత్సరాలతో పోల్చినప్పుడు 2021–22లో పెట్టుబడి–జీడీపీ నిష్పత్తి అధికం. ప్రయివేటు పెట్టుబడిలో రికవరి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. భారత్‌లో పెట్టుబడుల పెరుగుదలకు ఉన్న అవకాశాలను సర్వే ప్రస్తావించింది. 
తయారీ రంగంలో అమలులో ఉన్న అనేక ప్రయివేటు పెట్టుబడి ప్రాజెక్ట్‌ల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా అధికంగా ఉంది. ఆశిస్తున్న ప్రైవేట్‌ వినియోగ స్థాయిలలో పెరుగుదల సామర్థ్య వినియోగానికి దారితీసి.. ప్రయివేటు పెట్టుబడి కార్యకలాపాలను వేగవంతం చేస్తుందని సర్వే పేర్కొంది. రాబోవు త్రైమాసిక కాలంలో పెట్టుబడిదారులలో ఆశావాదం పెరుగుదల, ఉత్పత్తి విస్తరణలాంటి అవకాశాలను రిజర్వ్‌బ్యాంక్‌ ఇటీవలి ‘పారిశ్రామిక అవుట్‌ లుక్‌ సర్వే’లో ప్రస్తావించింది.

ఎగుమతులు

భారత్‌ ఎగుమతుల వృద్ధి 2021–22లో 16.5 శాతంగా ఉంటుందని సర్వే ప్రస్తావించింది. కరోనా ముందు కాలంతో పోల్చినప్పుడు 2021–22లో ఎగుమతులు, దిగుమతులలో వృద్ధి అధికంగా ఉంది. 2020–21లో మొదటి అర్ధభాగంతో పోల్చినప్పుడు.. 2021–22 మొదటి అర్ధభాగంలో భారత్‌ నికర ఎగుమతులలో వృద్ధి రుణాత్మకంగా ఉండటంతో కరెంట్‌ ఖాతా లోటు జీడీపీలో 0.2శాతంగా నమోదైంది. మూలధన ప్రవాహాలలో పెరుగుదల.. కరెంట్‌ ఖాతా లోటును భర్తీచేయగలదని సర్వే పేర్కొంది. 2021–22 రెండవ అర్ధ భాగంలో కరెంట్‌ ఖాతా లోటు పెరుగుదలకు ప్రపంచ వస్తు ధరల పెరుగుదల, అధిక స్వదేశీ డిమాండ్, మూలధన ప్రవాహాలలో అనిశ్చితి కారణాలుగా నిలుస్తున్నాయి. కరెంట్‌ ఖాతాలో ఏర్పడే లోటు ఆర్థిక వ్యవస్థ నిర్వహించగలిగే స్థాయిలోనే ఉంటుందని సర్వే ప్రస్తావించింది.

TSPSC Group 1 & 2: తెలంగాణ ఎకానమీ నుంచి 50 మార్కులు... రిఫరెన్స్ బుక్స్, వెయిటేజీ వివరాలు

బ్యాంకింగ్‌ వ్యవస్థ

బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థూల, నికర రికవరీ కానీ రుణాలలో తగ్గుదలను 2018–19 తర్వాతి కాలంలో గమనించవచ్చు. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల స్థూల రికవరీ కానీ రుణాల నిష్పత్తి.. 2020 సెప్టెంబర్‌ చివరి నాటికి 7.5శాతం కాగా 2021 సెప్టెంబర్‌ చివరి నాటికి 6.9శాతానికి తగ్గాయి. నికర రికవరీ కానీ రుణాల నిష్పత్తి 2017–18లో 6శాతం కాగా 2021 సెప్టెంబర్‌ చివరి నాటికి 2.2శాతానికి తగ్గాయి. 2015–16 తర్వాతి కాలంలో మూలధన సమృద్ధి నిష్పత్తి (ఇఅఖ)లో పెరుగుదల ఏర్పడింది.

ద్రవ్యోల్బణ కారణాలు

ఇంధన ధరల పెరుగుదల, ఆహారేతర వస్తుధరల పెరుగుదల, ఉత్పాధకాల ధరల (input) పెరుగుదల, ప్రపంచ సప్లయ్‌–చెయిన్‌ ఆటంకాలు వంటి  అంశాలు ప్రపంచ ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. 2020–21 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో వినియోగ ధరల సూచీ 6.6 శాతం నుంచి 2021–22 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో 5.2 శాతానికి తగ్గింది. డిసెంబర్‌ 2021లో వినియోగ ధరల సూచీ 5.6 శాతంగా నమోదయింది. టోకు ధరల సూచీలో రెండంకెల వృద్ధి నమోదైంది. టోకు ధరల సూచీ ‘ఇంధన, శక్తి’ గ్రూపునకు సంబంధించి ద్రవ్యోల్బణం 20శాతానికి పైగానే నమోదు కావడానికి అధిక అంతర్జాతీయ పెట్రోలియం ధరలు కారణమయ్యాయి.

తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి. ఏ పుస్తకాలు చదవాలి?

వ్యాక్సినేషన్‌ కీలకం

ప్రాణ నష్టాన్ని తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపోందించడంలో వాక్సినేషన్‌ ప్రధా న పాత్ర పోషించింది. జనవరి 16, 2022 నాటికి భారత్‌ ఒక సంవత్సర వాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 156 కోట్ల వ్యాక్సిన్‌ డోసెస్‌ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 88 కోట్ల జనాభాకు వాక్సినేషన్‌ ఇవ్వగా, వీరిలో 66 కోట్ల మందికి రెండు డోస్‌ల వాక్సినేషన్‌ పూర్తయింది. జనవరి 03, 2022న 15–18 వయోవర్గం వారికి విస్తరించారు. ఈ వయోవర్గంలో జనవరి 19, 2022 నాటికి 50శాతం మందికి మొదటి డోస్‌ వాక్సినేషన్‌ పూర్తియింది.

Dr Tamma Kotireddy
డా. తమ్మా కోటిరెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

Published date : 02 Jun 2022 05:37PM

Photo Stories