అసఫ్జాహీలు - 2
1. ‘హైదరాబాద్ స్టేట్ బ్యాంక్’ను ఎప్పుడు స్థాపించారు?
1) 1940
2) 1942
3) 1945
4) 1946
- View Answer
- సమాధానం: 2
2. ‘సింగరేణి బొగ్గు గనులు’ హైదరాబాద్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన సంవత్సరం?
1) 1942
2) 1940
3) 1944
4) 1946
- View Answer
- సమాధానం: 3
3. హైదరాబాద్‌లో ఉచిత ప్రాథమిక విద్యను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1927
2) 1925
3) 1929
4) 1922
- View Answer
- సమాధానం: 1
4. హైదరాబాద్ రాష్ట్రంలో మరణశిక్షను ఎప్పుడు రద్దు చేశారు?
1) 1924
2) 1918
3) 1920
4) 1922
- View Answer
- సమాధానం: 4
5. హైదరాబాద్‌లోని హైకోర్ట భవనాన్ని ఎప్పుడు నిర్మించారు?
1) 1919
2) 1920
3) 1921
4) 1923
- View Answer
- సమాధానం: 1
6. ఉస్మాన్ అలీఖాన్ ‘తబ్లిక్’ కార్యక్రమాన్ని దేని కోసం ప్రవేశపెట్టాడు?
1) ప్రభుత్వ ఉద్యోగాల నుంచిహిందువులను తొలగించడం
2) ఉర్దూ భాషను హిందువులపై బలవంతంగా రుద్దడం
3) హిందువులను ముస్లింలుగా మార్చడం
4) హిందువులపై మాత్రమే పన్ను విధించడం
- View Answer
- సమాధానం: 3
7. ‘బాబెహకుమత్’ అనే ప్రభుత్వ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1915
2) 1911
3) 1916
4) 1921
- View Answer
- సమాధానం:2
8. సాలార్జంగ్ ఏర్పాటు చేసిన 4 సుభాలను ఉస్మాన్ అలీఖాన్ రద్దు చేసిన సంవత్సరం?
1) 1929
2) 1927
3) 1925
4) 1923
- View Answer
- సమాధానం: 4
9. 1915లో హైదరాబాద్‌లో ‘సోషల్ సర్వీస్ లీగ్’ను ఎవరు స్థాపించారు?
1) కేశవరావు కోరాటక్కర్, వామనరావు నాయక్
2) వామనరావు నాయక్, టేకుమాల రంగారావు
3) కేశవరావు కోరాటక్కర్, ఆదిరాజు వీరభద్రరావు
4) వామనరావు నాయక్, ఆదిరాజు వీరభద్రరావు
- View Answer
- సమాధానం: 1
10. హరిజనోద్ధరణకు కృషి చేసిన ‘హ్యుమానిటేరియన్ లీగ్’ను ఎవరు స్థాపించారు?
1) ఆదిరాజు వీరభద్రరావు
2) వామనరావు నాయక్
3) భాగ్యరెడ్డి వర్మ
4) కొమర్రాజు లక్ష్మణరావు
- View Answer
- సమాధానం: 3
11. హైదరాబాద్ రాజ్యంలో వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం కావాలని కోరుతూ బట్లర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది?
1) హైదరాబాద్ స్టేట్ రాజ్యాంగ సంస్కరణ సంఘం
2) వామన్ నాయక్ ఆధ్వర్యంలోని ప్రథమ కాంగ్రెస్ కమిటీ
3) నిజాం ఆంధ్ర జనసంఘం
4) నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘం
- View Answer
- సమాధానం: 1
12. 1921 నవంబర్ 12న హైదరాబాద్‌లోని వివేకవర్థిని థియేటర్లో ఎవరి ఆధ్వర్యంలో ‘హిందూ సంస్కరణ సభ’ సమావేశం నిర్వహించారు?
1) టేకుమాల రంగారావు
2) ఆలంపల్లి వెంకటరామారావు
3) కార్వే
4) వామన్ నాయక్
- View Answer
- సమాధానం: 3
13. ‘నిజాం ఆంధ్ర జనసంఘం’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 12 నవంబర్ 1921
2) 21 నవంబర్ 1921
3) 12 నవంబర్ 1920
4) 21 నవంబర్ 1920
- View Answer
- సమాధానం: 1
14.నిజాం ఆంధ్ర జనసంఘాన్ని ఎవరి ఇంట్లో స్థాపించారు?
1) ఆలంపల్లి వెంకట్రామారావు
2) భాగ్యరెడ్డి వర్మ
3) ఆదిరాజు వీరభద్రరావు
4) టేకుమాల రంగారావు
- View Answer
- సమాధానం:4
15. ‘నీలగిరి’, ‘తెనుగు’ పత్రికలు ఏ సంవత్సరంలో వెలువడ్డాయి?
1) 1924
2) 1923
3) 1922
4) 1921
- View Answer
- సమాధానం: 3
16. ‘నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘం’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1923 ఏప్రిల్ 1
2) 1923 ఏప్రిల్ 11
3) 1920 నవంబర్ 12
4) 1920 నవంబర్ 21
- View Answer
- సమాధానం:1
17. నిజాం ఆంధ్ర కేంద్ర జనసంఘం మొదటి అధ్యక్ష, కార్యదర్శులు ఎవరు?
1) వామన్ నాయక్, కొండా వెంకటరంగారెడ్డి
2) కొండా వెంకట రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి
3) రాజగోపాల్ రెడ్డి, మాడపాటి హనుమంతరావు
4) మాడపాటి హనుమంతరావు, వామన్ నాయక్
- View Answer
- సమాధానం: 3
18. మధిరలో ప్రథమ గ్రంథాలయ సభను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1923
2) 1922
3) 1926
4) 1925
- View Answer
- సమాధానం: 4
19. 1926లో రెండో గ్రంథాలయ సభను ఎక్కడ నిర్వహించారు?
1) దేవరకొండ
2) సూర్యాపేట
3) నల్లగొండ
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 2
20. ‘ఆంధ్ర మహాసభ’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1927
2) 1928
3) 1930
4) 1925
- View Answer
- సమాధానం: 3
21. ఆంధ్ర మహాసభ ఏర్పడే వరకు తెలంగాణప్రాంతంలో సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి కృషిచేసిన సంస్థ ఏది?
1) హైదరాబాద్ స్టేట్ రాజ్యాంగ సంస్కరణ సంఘం
2) ఆంధ్రజన కేంద్ర సంఘం
3) హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ
4) బట్లర్ కమిటీ
- View Answer
- సమాధానం: 2
22. ఎవరి సారథ్యంలో ‘ఆంధ్ర పరిశోధక మండలి’ని ఏర్పాటు చేశారు?
1) ఆదిరాజు వీరభద్రరావు
2) నాయని వెంకట రంగారావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) భాగ్యరెడ్డి వర్మ
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో ‘ఆంధ్ర పరిశోధక (లక్ష్మణరాయ) మండలి’ చేసిన కార్యక్రమం ఏది?
1) తెలంగాణ చరిత్ర వెలికితీతకు కృషి చేసింది
2) అనేక శాసనాలను వెలికితీసింది
3) అనేక తాళపత్ర గ్రంథాలను వెలికితీసింది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
24. 1935లో ‘తెలంగాణ శాసనాలు’ అనే పుస్తకాన్ని ప్రచురించినవారు?
1) ఆదిరాజు వీరభద్రరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) భాగ్యరెడ్డి వర్మ
4) నాయని వెంకట రంగారావు
- View Answer
- సమాధానం: 1
25. ‘సాలార్జంగ్’ బిరుదుతో మీర్ లాయక్ ‘దివాన్’గా ఎప్పుడు నియమితుడయ్యాడు?
1) 1883
2) 1884
3) 1887
4) 1886
- View Answer
- సమాధానం: 2
26. హైదరాబాద్ రాజ్యంలో అధికార భాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టింది ఎవరు?
1) సాలార్జంగ్
2) రెండో సాలార్జంగ్
3) కిషన్ పెర్షాద్
4) రాజా నరేంద్ర
- View Answer
- సమాధానం: 2
27. కిషన్ పెర్షాద్ కొంతకాలం ఏ పాలకుని వద్ద ప్రధానిగా పనిచేశాడు?
1) సికిందర్ జా
2) నిజాం ఉద్దౌలా
3) అఫ్జల్ ఉద్దౌలా
4) మహబూబ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 4
28. కిషన్ పెర్షాద్ ‘దివాన్’ అయిన సంవత్సరం?
1) 1903
2) 1911
3) 1904
4) 1901
- View Answer
- సమాధానం: 4
29.దివాన్‌గా కిషన్ పెర్షాద్ హైదరాబాద్ రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విభజించాడు?
1) 5
2) 4
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 2
30. ‘మీర్ లాయక్’ అనేది కింది వారిలో ఎవరి అసలు పేరు?
1) కిషన్ పెర్షాద్
2) రాజా నరేంద్ర
3) మొదటి సాలార్జంగ్
4) రెండో సాలార్జంగ్
- View Answer
- సమాధానం: 4
31. ‘హిందూ సోషల్ క్లబ్’ను ఎప్పుడు స్థాపించారు?
1) 1892
2) 1885
3) 1895
4) 1894
- View Answer
- సమాధానం: 1
32. హిందూ సోషల్ క్లబ్‌ను ఏ ప్రధాన లక్ష్యంతో స్థాపించారు?
1) హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం
2) లండన్ వెళ్లే హిందూ విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్లు ఇప్పించడం కోసం
3) తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయడం
4) సర్ బరాహీ పద్ధతిని రద్దు చేయించడం
- View Answer
- సమాధానం: 2
33. హైదరాబాద్‌లో ఆర్యసమాజ్ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1890
2) 1894
3) 1892
4) 1895
- View Answer
- సమాధానం: 3
34. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలను ప్రారంభించింది?
1) హిందూ సోషల్ క్లబ్
2) ఆర్యసమాజ్ శాఖ
3) విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి
4) నిజాం ఆంధ్ర జనసంఘం
- View Answer
- సమాధానం: 2
35. ఆర్యసమాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) వ్యాయామ శాఖలు స్థాపించింది
2) హరికథలు, భజన మండళ్ల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించింది
3) హిందువులు ఎదుర్కొంటున్న అనేక ఆటంకాలను తొలగించడానికి కృషిచేసింది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
36. అసఫ్‌జాహీల కాలంలో ‘సర్‌బరాహి’ అంటే ఏమిటి?
1) అధికారులకు వివిధ వృత్తులవారు చెల్లించే బహుమతులు
2) వ్యాపారులు రాజులకు ఉచితంగా సరకులు సరఫరా చేసే పద్ధతి
3) అధికారులకు ప్రజలు పన్నులు చెల్లించే పద్ధతి
4) వ్యాపారులు అధికారులకు ఉచితంగా సరకులు సరఫరా చేసే పద్ధతి
- View Answer
- సమాధానం: 4
37. హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం గ్రంథాలయాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1900
2) 1904
3) 1901
4) 1903
- View Answer
- సమాధానం: 3
38. సాంస్కృతిక వికాసోద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో మొదట ప్రారంభమైన ఉద్యమం ఏది?
1) వందేమాతర ఉద్యమం
2) గ్రంథాలయోద్యమం
3) హరిజనోద్యమం
4) స్త్రీజనోద్ధరణోద్యమం
- View Answer
- సమాధానం: 2
39. హనుమకొండలో ‘రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం’ ఎప్పుడు స్థాపించారు?
1) 1904
2) 1905
3) 1902
4) 1903
- View Answer
- సమాధానం: 1
40.సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయాన్ని స్థాపించిన సంవత్సరం?
1) 1903
2) 1904
3) 1905
4) 1906
- View Answer
- సమాధానం: 3
41. హైదరాబాద్‌లో ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1904
2) 1906
3) 1905
4) 1907
- View Answer
- సమాధానం: 2
42. విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని ఎవరి ఆధ్వర్యంలో స్థాపించారు?
1) కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు
2) కొమర్రాజు లక్ష్మణరావు, ఆదిపూడి సోమనాథరావు
3) ఆదిపూడి సోమనాథరావు, నాయని వెంకట రంగారావు
4) రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు
- View Answer
- సమాధానం: 1
43. కింది వాటిలో ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనకు సంబంధించి సరైంది ఏది?
1) 1918లో గండిపేట చెరువు నిర్మాణం
2) 1922లో హిమాయత్ సాగర్ నిర్మాణం
3) 1942లో నిజాంసాగర్ నిర్మాణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
44.హైదరాబాద్‌లో పురావస్తు శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1910
2) 1914
3) 1911
4) 1912
- View Answer
- సమాధానం: 2
45. ఉస్మాన్ అలీఖాన్ పాలనకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1932లో మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు
2) హైదరాబాద్‌లో వెట్టిచాకిరి నిషేధించాడు
3) దేవదాసి వ్యవస్థను నిషేధించాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 28-09-1919
2) 28-08-1918
3) 28-08-1919
4) 28-09-1918
- View Answer
- సమాధానం:3
47. ‘హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1910
2) 1912
3) 1915
4) 1916
- View Answer
- సమాధానం: 2
48. ‘ఉస్మానియా ఆసుపత్రి’ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1935
2) 1925
3) 1927
4) 1937
- View Answer
- సమాధానం: 3
49. ‘హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ను ఎప్పుడు స్థాపించారు?
1) 1935
2) 1937
3) 1936
4) 1934
- View Answer
- సమాధానం:4
50. హైదరాబాద్ సెకండరీ విద్యాబోర్డ్ ను ఎప్పుడు స్థాపించారు?
1) 1936
2) 1934
3) 1939
4) 1935
- View Answer
- సమాధానం: 1
51. హైదరాబాద్‌లో ‘చాదర్‌ఘాట్ బ్రిడ్జి’ని ఎవరి కాలంలో నిర్మించారు?
1) నాసిరుద్దౌలా
2) సికిందర్ జా
3) నిజాం అలీఖాన్
4) అఫ్జలుద్దౌలా
- View Answer
- సమాధానం: 1
52. హైదరాబాద్‌లో 1854లో ‘కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (గాంధీ ఆసుపత్రి)’ ఎవరి కాలంలో నిర్మించారు?
1) సికిందర్ జా
2) ముబారిజ్ ఉద్దౌలా
3) నాసిరుద్దౌలా
4) నిజాం అలీఖాన్
- View Answer
- సమాధానం: 3