TSPSC Groups Best Books: గ్రూప్–2 పుస్తకాల ఎంపిక ఇలా.. : వి.శివకుమార్, గ్రూప్–2 విజేత
నోటిఫికేషన్ సంకేతం వచ్చిదంటే చాలు.. ప్రిపరేషన్‌లో నిమగ్నమైపోతారు. విజయ సాధనకు నిర్విరామంగా కృషి చేస్తుంటారు! లక్షల మంది పరీక్షలు రాసినా.. విజయం దక్కేది కొందరికే!అడుగులు తడబడకుండా.. గమ్యం వైపు ప్రయాణం సాగించే వారే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. విజేతల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఈ గ్రూప్ 2 టాపర్ ఎలా చదివారు.. ఈయన అనుసరించిన ప్రణాళిక ఏంటి..? గ్రూప్–2 విజేత వి.శివకుమార్ (అసిస్టెంట్ రిజిస్ట్రార్ – కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్) గారి సలహాలు, సూచనలు మీ కోసం..
టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్
ఇందుకోసం కచ్చితంగా హైస్కూల్ స్థాయి పుస్తకాలను..
గ్రూప్స్ అభ్యర్థులు ముందుగా తమ స్వీయ సామర్థ్యాలపై అవగాహన పెంచుకోవాలి. సాధించగలం అనే ఆత్మస్థయిర్యం సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌తో ప్రిపరేషన్ ప్రారంభించాలి. దాని ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్ లేదా టాపిక్‌పై అన్ని కోణాల్లో పూర్తి పట్టు సాధించాలి. ఇందుకోసం కచ్చితంగా హైస్కూల్ స్థాయి పుస్తకాలను చదవాలి. దీనివల్ల సమయం వృధా అవుతుందనే భావన వీడాలి. పాఠశాల స్థాయి పుస్తకాలు చదవడం వల్ల సబ్జెక్ట్‌లలో వచ్చిన గ్యాప్‌ను నిలువరించుకోవచ్చు. వాస్తవానికి దీన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానాన్ని పాటించాను.
టీఎస్‌పీఎస్సీ ప్రివియస్ పేపర్స్
ఎందుకు? ఏమిటి? ఉద్దేశం ఏమిటి? తదితర కోణాల్లో..
గ్రూప్స్‌కు మొదటిసారి సన్నద్ధమవుతున్న వారు ప్రతి టాపిక్‌ను చదవాలి. అంతేకాకుండా ప్రత్యేకమైన రీడింగ్ టెక్నిక్స్ పాటించాలి. ఒక సబ్జెక్ట్‌లోని అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి సొంతంగా ప్రశ్నలు రూపొందించుకోవాలి. ఎందుకంటే పుస్తకాల్లోని అంశాలు ప్రశ్న–సమాధానం రూపంలో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అంశానికి సంబంధించి.. ఎందుకు? ఏమిటి? ఉద్దేశం ఏమిటి? తదితర కోణాల్లో సొంతంగా ప్రశ్నలను రూపొందించుకుని, వాటికి పుస్తకంలోని అంశాలతో తులనాత్మక సమాధానాలను గుర్తిస్తే.. ఆ అంశం నుంచి అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్
ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం..
ఇప్పటికే గ్రూప్స్‌కు హాజరై మరోసారి సిద్ధమవుతున్న వారు ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేసుకోవాలి. అదే విధంగా ప్రతి టాపిక్‌కు సంబంధించి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం వంటివి చేయాలి.
పుస్తకాల ఎంపిక ఇలా..
పుస్తకాల ఎంపిక కూడా విజయంలో ఎంతో కీలకంగా నిలుస్తుందని గుర్తించాలి. అందుకోసం ప్రామాణిక పుస్తకాలను, సిలబస్‌కు సరితూగే అంశాలు ఉన్న పుస్తకాలను ఎంచుకోవాలి. నేను పూర్తిగా అకాడమీ పుస్తకాలు, స్కూల్ పుస్తకాలనే అనుసరించాను. అకాడమీ పుస్తకాలు చదివేటప్పుడు కూడా ప్రత్యేక వ్యూహం అవసరం. వీటిలో ఫ్యాక్ట్‌తో కూడిన సమాచారం మాత్రమే ఉంటుంది. ఆ ఫ్యాక్ట్స్‌కు సంబంధించి సమకాలీన పరిణామాల గురించి తెలుసుకోవాలి.దీనికోసం సంబంధిత విషయాలపై న్యూస్ పేపర్స్‌లో వచ్చే సంపాదకీయాలు, విశ్లేషణలు చదవాలి.
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేరకే ఉద్యోగాల భర్తీ
గ్రూప్–1, 2 రెండింటికీ హాజరయ్యే అభ్యర్థులు సబ్జెక్టివ్‌గా చదివితేనే విజయం దక్కుతుందని గుర్తించాలి. ఒక అంశానికి సంబంధించి సామాజికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా ప్రభావితం చేసే విషయాలను అధ్యయనం చేయాలి.