TSPSC Group 1 Prelims: ‘జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ ’ నుంచి అడిగే ప్రశ్నలు ఇలా..!
ఇవి చదివితే..ఈజీగా మార్కులు..!
జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగానికి కూడా ప్రిలిమ్స్‌లో తగినంత ప్రాధాన్యం ఉంటోంది. కనీసం పది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ విభాగంలో రాణించాలంటే.. నంబర్ సిరీస్, రీజనింగ్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, ఇన్ఫరెన్సెస్, సగటు, శాతాలు, నిష్పత్తి, గడియారాలు, క్యాలెండర్, అరేంజ్‌మెంట్స్, పెర్ముటేషన్స్, కాంబినేషన్స్, నంబర్ సిస్టమ్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం టేబుల్స్, బార్ డయా గ్రామ్స్, పై డయాగ్రామ్స్, గ్రాఫ్స్‌పై ఎక్కువ దష్టి పెట్టాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ప్రై మ్ నెంబర్స్, నంబర్ అనాలజీ క్లాసిఫికేషన్‌లపై పట్టు సాధించాలి. అర్థమెటిక్‌కు సంబంధించి కాలం–దూరం, కాలం–పని; లాభం–నష్టం; భాగస్వామ్యం; సాధారణ వడ్డీ; చక్రవడ్డీ; నిష్పత్తి–అనుపాతం; శాతాలు; కసాగు; గసాభా వంటి వాటిని ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఇలా ప్రతి టాపిక్‌కు సంబంధించి వెయిటేజీకి అనుగుణంగా ముఖ్యమైన అంశాలను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించడం ద్వారా ప్రిలిమ్స్‌లో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!