TSPSC Group 4 Cutoff Marks 2023 Details : గ్రూప్-4 కటాప్ మార్కులు ఇలా.. ఈ మార్కుల మధ్యలో ఉంటే.. సేఫ్ జోన్‌లో ఉన్నట్టే..?
ఈ నేపథ్యంలో.. గ్రూప్-4 ఉద్యోగాల సంఖ్య, పరీక్షకు హాజరైన అభ్యర్థులు సంఖ్య, పరీక్ష పేపర్ ఆధారంగా, Reservation Policy, Previous Year Cutoff Marks, ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల ఇచ్చిన సలహాలు-సూచనలు, వివిధ సర్వేల ఆధారంగా ఈ ఏడాది గ్రూప్-4 కటాఫ్ అంచనా ను కింది పట్టికలో ఇస్తున్నాము.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 కటాప్ మార్కుల అంచనా ఇలా..
Category | Marks |
Unreserved (General) | 200-225 |
Other Backward Caste(OBC) | 180-200 |
Scheduled Caste (SC) | 150-180 |
Scheduled Tribe (ST) | 140-170 |
ఈ కటాఫ్ మార్కులు కేవలం ఒక అంచనా మాత్రమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన కటాఫ్ మార్కులు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. జిల్లా, జోనల్ స్థాయిని బట్టి కూడా కటాప్ మార్కులు మారే అవకాశం ఉంటుంది.
చదవండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్-3 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇదే..
జూలై రెండో వారంలో ప్రాథమిక కీ ..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూలై 1వ తేదీన నిర్వహించిన గ్రూప్-4 రాత పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 8,180 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూలై రెండో వారంలో ప్రాథమిక కీ ని అధికారులు విడుదల చేసే అవకాశం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)
☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)
గ్రూప్-4 ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
TSPSC Group 4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-4 ఫలితాలను జూలై నెల చివరికి విడుదల చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఈ ఫలితాల విడుదల కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై చివరికి సాధ్యపడకపోతే.. ఆగస్టు మొదటి వారంలో ఈ గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
చదవండి: TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చదివారంటే..
ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని..
ఈ గ్రూప్-4 ఫలితాల విడుదలలో భాగంగా ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రకటించనున్నారు. ఈ మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్ ఆప్షన్ల ద్వారా నిర్ధారించనున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ఆయా పోస్టులకు పోటీపడే అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేయనున్నారు. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి.. తుది జాబితాను ప్రకటిస్తారు.
చదవండి: APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్ రాసుకుని.. గుర్తు పెట్టుకోవడం ఎలా..?
ఈ ప్రక్రియ ముగియడానికి ఫలితాల ప్రకటన తర్వాత నెల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశముంది. ఎన్నికల షెడ్యూల్ నవంబరు లేదా డిసెంబరులో విడుదలయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఆ లోపు టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ Group 1&2&3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ