Skip to main content

APPSC Group1 Ranker Vidhya Sri Success Story : గ్రూప్‌–1 సాధించానిలా.. ఎప్ప‌టికైన నా ల‌క్ష్యం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. 2018 డిసెంబర్‌లో మొత్తం 167 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
APPSC Group1 Ranker Vidhya Sri Success Story Telugu
APPSC Group1 Ranker Vidhya Sri Success Story

ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన విద్యశ్రీ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం గ్రామానికి చెందిన తాళ్ళూరి విద్యశ్రీ. తండ్రి శ్రీనివాసరావు పంచాయతీరాజ్‌శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి జాన్సీరాణి వడ్లూరు హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు.

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

ఎడ్యుకేష‌న్ :
2012–14లో విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశారు. 2018లో చెన్నయ్‌ సత్యభామ యూనివర్సిటీలో బీటెక్‌ ప్రథమ స్థానం నిలిచి.. బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. 

చిన్న‌త‌నం నుంచే..
చిన్నతనం నుంచి కష్టపడి చదువుతూ తాను ఎంచుకున్న లక్ష్యాలను సాధించడానికి నిరంత‌రం కృషి చేశారు. తాను అనుకున్న‌ట్టే.. గ్రూప్‌-1లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపిక‌య్యారు.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

నా ల‌క్ష్యం ఇదే..
ఈ నేప‌థ్యంలో ఆమె మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నానన్నారు. ఈ జర్నీలో భాగంగా తండ్రి శ్రీనివాసరావు, తల్లి జాన్సీలక్ష్మీ ఎంతగానో ప్రొత్సహించారన్నారు. ఐఏఎస్‌ సాధించి, పేద ప్రజలకు సేవలందించమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.

Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..

ఈ సారి మహిళలదే హావా.. 
ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు.  అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్‌ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్‌ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.

APPSC Group-1 Ranker Success Story : రైతు బిడ్డ.. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడిలా.. వీరి ప్రోత్సాహంతోనే..
 
తొలిసారిగా..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు.

APPSC Group-1 Ranker Bharath Nayak Success Story : భరత్‌ అనే నేను.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..

ఈ సారి ఇంటర్వ్యూలను మాత్రం..
2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

APPSC Group1 Ranker Aravind Success Story : గ్రూప్‌–1 ఆఫీసర్‌ కావాలని కలలు కన్నాడు.. అనుకున్న‌ట్టే సాధించాడిలా..

Published date : 02 Aug 2022 07:46PM

Photo Stories