Skip to main content

TSPSC: రెండు, మూడు రోజుల్లో గ్రూప్‌1 ప్రిలిమినరీ ఫలితాలు..?

గ్రూప్‌–1 ఫలితాల కోసం మూడు నెలలుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. 2022 అక్టోబర్‌లో ప్రిలిమనరీ పరీక్ష పూర్తయినా ఇంతవరకు ఫలితాలపై స్పష్టత లేకపోవడంతో పరీక్ష రాసిన వారు ఆందోళనకు గురయ్యారు.
Results

దీనికి తోడు కోర్టుల్లో కేసులు పడడంతో అసలు ఫలితాలు విడుదల చేస్తారా.? లేదా అన్న మీమాంసలో ఉండిపోయారు. అయితే ఇలాంటి వార్తలకు చెక్‌ చెబుతూ అభ్యర్థులకు టీపీపీఎస్సీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 

75 ఏళ్ల తర్వాత ఆ ఊర్లో లైట్‌ వెలిగింది....
503 గ్రూప్‌1 ఉద్యోగాలకు అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించి, చివరికి 5 ప్రశ్నలను తొలిగించి, నవంబర్‌ 15న తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ తర్వాత రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇంతలోనే కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. 

సీఎం.. పీఎం.. జీతాలెంతో తెలుసా...?
అయితే కోర్టులో వాదనలు జనవరి 10, 11 తేదీల్లో పూర్తవుతాయని టీపీపీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. చివరి హియరింగ్‌ పూర్తయి తీర్పు రాగానే ఫలితాలు విడుదల చేసేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియను రెండు నెలల క్రితమే టీఎస్‌పీఎస్సీ పూర్తి చేసింది. తుది ఫలితాల ప్రకటనలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని కమిషన్‌  భావిస్తోంది. 

ఎంబీబీఎస్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌... యూపీఎస్సీలో ఫెయిల్‌...
ముందుగా విడుదల నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్‌1 మెయిన్స్‌ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ఫలితాలు ఇప్పటికే ఆలస్యమవడంతో మెయిన్స్‌ కూడా వాయిదా వేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల నాటి నుంచి కనీసం మూడు నెలల గ్యాప్‌ తర్వాత మెయిన్స్‌ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. కోర్టు ఇబ్బందులు తొలగి ఈ జనవరిలోనే ఫలితాలు విడుదలైతే మెయిన్స్‌ మే మొదటివారంలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే మే 28న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది.  

గ్రూప్‌-1 ప్రిలిమ్స్ తీరు ఇదే.. ఎక్కడా డైరెక్ట్‌ ప్రశ్నలు లేకుండానే..
గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 503 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారిగా ప్రిలిమినరీ ‘కీ’తో పాటే ప్రతి ఒక్క అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, గ్రూప్‌1 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలోనే వెల్లడించింది. అంటే, 503 ఉద్యోగాలకు మొత్తం 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు.

Published date : 10 Jan 2023 01:46PM

Photo Stories