Skip to main content

Centrav Govt Scheme: 75 ఏళ్ల తర్వాత ఆ ఊర్లో లైట్‌ వెలిగింది....

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్నా ఇంకా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మారుమూల ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి.
Electrecity

అదే కోవకు చెందుతుంది జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా డూరు బ్లాక్‌ పరిధిలోని టెథాన్‌  గ్రామం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఆ ఊరికి విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు అధికారులు. అనంతనాగ్‌ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి 75 ఏళ్ల తర్వాత కరెంట్‌ సరఫరా జరుగుతోంది. 

సీఎం.. పీఎం.. జీతాలెంతో తెలుసా...?
కొండ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామం టెథాన్‌ లో సుమారు 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం డెవలప్‌మెంట్‌ ప్యాకేజీ స్కీమ్‌లో విద్యుత్తు సరఫరాను అందించారు. తమ ఇళ్లల్లో విద్యుత్తు కాంతులు చూసి అక్కడి ప్రజలు డ్యాన్స్‌లు వేస్తూ మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు తమ అవసరాల కోసం కలప, దీపాలను వాడేవారు.

ఎంబీబీఎస్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌... యూపీఎస్సీలో ఫెయిల్‌...
‘ఈరోజు తొలిసారి విద్యుత్తు కాంతులను చూస్తున్నాం. ఇకపై మా పిల్లలు విద్యుత్తు దీపాల కింద చదువుకుంటారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. కరెంట్‌ లేకపోవడంతో చాలా కష్టాలు పడ్డాము. ఇప్పటి వరకు మా అవసరాల కోసం కలపను ఉపయోగించాం. ఇప్పుడు మా సమస్యలకు ఓ పరిష్కారం లభించింది. ప్రభుత్వానికి, విద్యుత్తు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని ఫాజుల్‌ ఉదిన్‌  ఖాన్‌  అనే గ్రామస్తుడు సంతోషం వ్యక్తం చేశారు.

Published date : 09 Jan 2023 07:16PM

Photo Stories