Skip to main content

PM Modi Salary: సీఎం.. పీఎం.. జీతాలెంతో తెలుసా...?

నోటు... బతుకుబండిని నడిపించేది పచ్చనోటే. మనుషులందరికీ ఒక కుతూహలం ఉంటుంది... ఎదుటోడి శాలరీ(జీతం) ఎంతో తెలుసుకునేందుకు... తన కంటే ఎక్కువ వస్తే ఈర్ష్య పడడం.. ఎదుటోడికి మనకంటే తక్కువ జీతం ఉంటే సంతోషించడం మానవ సహజ లక్షణం.

అయితే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి జీతాలు కూడా ఎంతో తెలుసుకోవాలని ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కథనం...

ఎంబీబీఎస్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌... యూపీఎస్సీలో ఫెయిల్‌...
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి జీతాలు కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ అఫ్‌ ఇండియా నుంచి వస్తాయి.  రాష్ట్రపతి.. రాజ్యాంగ బద్ధంగా భారతదేశానికి అధిపతి. భారత సాయుధ దళాలకు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తి రాష్ట్రపతి. పదవిలో ఉన్న వారికి నెలకు ఐదు లక్షలు చెల్లిస్తారు. 2018లో రాష్ట్రపతి వేతనాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. 1998కి ముందు రాష్ట్రపతికి రూ.10,000 చెల్లించేవారు. 1998లో ఈ మొత్తాన్ని రూ.50,000కు పెంచారు. రాష్ట్రపతికి జీతంతో పాటు అనేక అలవెన్సులు కూడా లభిస్తాయి.

పాఠాలు నేర్పిన యూ ట్యూబ్‌.... 60 లక్షలతో అదరగొట్టిన గుంటూరమ్మాయి
ఉప రాష్ట్రపతి.... పార్లమెంటు అధికారుల జీతాలు, అలవెన్సుల చట్టం, 1953 మేరకు దేశ ఉప రాష్ట్రపతి జీతాన్ని నిర్ణయిస్తారు. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌ గా కూడా వ్యవహరిస్తారు. కాబట్టి స్పీకర్‌ జీతం, ప్రయోజనాలను అందుకుంటారు. ఉప రాష్ట్రపతికి నెలకు రూ.4 లక్షలు చెల్లిస్తారు. దీంతో పాటు వివిధ అలవెన్సులు అందజేస్తారు.

ప్రజల చేతికి ప్రభుత్వమే తుపాకులు ఇస్తోంది.... ఇప్ప‌టికే 5 వేల మంది రిజిస్ట్రేష‌న్‌
ప్రధాన మంత్రి.... మన దేశ ప్రధాన మంత్రికి రెండు లక్షల జీతం ఉంటుంది. దానితో పాటు పార్లమెంటు సభ్యుడుగా ఉన్నందుకు నాలుగు లక్షల జీతం అందుకుంటారు. అంటే మొత్తం ఆరు లక్షల రూపాయలు. దీంతో పాటు అలవెన్సులు అదనం.
సుప్రీం కోర్టు సీజే.... సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ.2 .80 లక్షల జీతం ఉంటుంది. కానీ వీరికి ప్రత్యేక అలవెన్స్‌లు ఉండవు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.... సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు రూ. 2 .50 లక్షల జీతం ఉంటుంది.

బార్బర్‌గా స్టార్ట్‌ చేసి... నేడు కోట్లకు అధిపతి... అచ్చం రాజా సినిమా స్టోరీలాగే...

గ‌వ‌ర్న‌ర్‌... ఒక రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు నెల‌కు రూ.5ల‌క్ష‌ల జీతం ఉంటుంది. దీనికి అల‌వెన్సులు అద‌నంగా చెల్లిస్తారు.
ముఖ్యమంత్రి... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేవలం రూ. 50 వేలు మాత్రమే జీతంగా ఉంటుంది. కానీ, దానితో పటు శాసన సభ సభ్యుడిగా ఉన్నందుకు మూడున్నర లక్షల రూపాయల(రాష్ట్రాలను బట్టి మారుతుంది) జీతం వస్తుంది. జీతంతో పాటు వివిధ అలవెన్సులు అదనంగా ఉంటాయి.

Published date : 09 Jan 2023 06:06PM

Photo Stories