TS Group 1 Mains Exam Dates 2023 : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఇవే.. ఈ సారి ఈ విధానంలోనే..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 మొదటి దశ ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన విషయం తెల్సిందే. జోన్లు, రిజర్వేషన్లు వారీగా 1:50 నిష్పత్తి చొప్పున మెయిన్‌కు మొత్తం 25,050 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
☛ TSPSC Group-1 : మెయిన్‌లో మార్పులు.. మెరిసే మార్గాలు ఇవే..
ఈ సారి గ్రూప్-1 మెయిన్స్‌ను..
గ్రూప్-1 మెయిన్ పరీక్ష వ్యాస రూప(డిస్క్రిప్టివ్) విధానంలో ఉంటుంది. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు. నిర్దేశించిన ఆరు పేపర్లలోనూ అభ్యర్థులు వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అర్హత పేపర్‌గా నిర్దేశించిన ఇంగ్లిష్ సైతం డిస్క్రిప్టివ్‌లోనే ఉంటుంది. దీంతో ప్రిపరేషన్ సమయంలోనే అభ్యర్థులు ఆయా అంశాలను విశ్లేషణాత్మక ధృక్పథంతో అధ్యయనం చేయాలి. అదే విధంగా ప్రశ్న అడిగిన తీరు, ఉద్దేశాన్ని గ్రహించి.. దానికి తగినట్లుగా సమాధానం రాసే నైపుణ్యం పెంచుకోవాలి. సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు సాధించడంతోపాటు ముఖ్యాంశాలతో సొంతంగా నోట్స్ రాసుకోవాలి. దీంతోపాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్
TSPSC Group 1 Mains Exam Schedule 2023 పూర్తి వివరాలు ఇవే..