TSPSC Group-1 Prelims: గ్రూప్–1లో ఈ కీలక అంశాల నుంచి 35–40 ప్రశ్నలు వచ్చే అవకాశం..!
అభ్యర్థులు నిబద్ధత, పట్టుదలతోపాటు పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు ఇ.హరికృష్ణ సూచిస్తున్నారు. అలాగే ఏఏ అంశాలను ఎలా చదవాలో ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు క్రింది విధంగా సూచించారు.
TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..
ప్రిలిమ్స్‌లో వీటికి సులభంగా..
గ్రూప్–1 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలతోపాటే మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉమ్మడిగా ఉన్నటువంటి అంశాలను కలిపి చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో.. అంతరిక్ష కార్యక్రమాలు, రక్షణ, శక్తి వనరులు, ఐటీ కార్యక్రమాలు, ఎమర్జింగ్ టెక్నాలజీలు, టెక్నాలజీ మిషన్స్ వంటి అంశాలు మెయిన్స్ పేపర్–5లో ఉన్నాయి. వీటిని మెయిన్స్ స్థాయి ప్రిపరేషన్‌లో చదువుకోవడం ద్వారా ప్రిలిమ్స్‌లో వీటికి సులభంగా సమాధానాలు గుర్తించగలుగుతారు.
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
అభ్యర్థులు ఈ తరహాలో చదవకుండా..
మెయిన్స్‌లో శీతోష్ణస్థితిలో మార్పు, ప్రపంచ పర్యావరణ అంశాలు, కాలుష్యం సుస్థిరాభివృద్ధి, ఒప్పందాలు, సహజ వనరులు వంటి అంశాలున్నాయి. వీటికి ప్రిలిమ్స్‌లోనూ ప్రాధాన్యత ఉంది. అభ్యర్థులు బిట్స్ తరహాలో చదవకుండా ప్రతి అంశానికి సంబంధించిన మూల భావనలతోపాటు వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌పై దృష్టి సారించాలి. ప్రిలిమ్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం,విపత్తు నిర్వహణ అంశాలపై 35–40 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి