Skip to main content

TSPSC Group 1 Exam: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Preparations for Group-1 preliminary examination discussed by officials  TSPSC Group 1 Exam  Hyderabad District Additional Collector Patil Hemanta Keshav addressing officials

సాక్షి, సిటీబ్యూరో: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ అన్నారు. జూన్‌ 9న నిర్వహించనున్న పరీక్ష ఏర్పాట్ల పై రీజినల్‌ కోఆర్డినేటర్లు, జాయింట్‌ కస్టోడియన్స్‌, పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్స్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ జిల్లాలో 40,569 మంది అభ్యర్థులు పరీక్షకు హజరు కానున్నారని, ఇందు కోసం 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

RS Praveen Kumar : జూన్ 9వ తేదీన నిర్వ‌హించే.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాల్సిందే..!

పరీక్షా కేంద్రంలోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని కూడా అనుమతించవద్దన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, జాయింట్‌ కస్టోడియన్లు,రీజినల్‌ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Published date : 01 Jun 2024 11:38AM

Photo Stories