TGPSC Group 1 Prelims: జూన్ 9న టీజీపీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష.. రివిజన్‌తో సక్సెస్ ఇలా..!
సాక్షి ఎడ్యుకేషన్: టీజీపీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను మొత్తం 563 పోస్టులకు నాలుగు లక్షలకుపైగానే దరఖాస్తులు వచ్చాయి. గతంలో రెండుసార్లు ప్రిలిమ్స్ రాసిన వారు, సివిల్స్ అభ్యర్థులతోపాటు ఫ్రెషర్స్ కూడా పోటీ పడే అవకాశముంది. కాబట్టి ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడం అత్యంత కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ గట్టేక్కేందుకు నిపుణుల ఎగ్జామ్ డే టిప్స్..
School Admissions: మన బడుల్లో చేరండి.. విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారు ప్రణాళిక
గ్రూప్–1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తుది దశ ప్రిపరేషన్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలి. రిపీటర్స్‌కు ప్రశ్నల శైలిపై అవగాహన ఉండడం వారికి కొంత కలిసొచ్చే అంశం. తాజా అభ్యర్థులు సైతం పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించొచ్చు అంటున్నారు నిపుణులు.
పెరిగిన పోటీ
గతంతో పోలిస్తే టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1–2024 నోటిఫికేషన్‌కు పోటీ బాగా పెరిగింది. గ్రూప్–1 (2022) తొలి నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2,86,051 మంది.. దాన్ని రద్దు చేసి రెండోసారి జరిపిన ప్రిలిమ్స్‌కు 2,33,248 మంది హాజరయ్యారు. నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ.. 2024 ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్ట్‌ల సంఖ్యను 503 నుంచి 563కు పెంచారు.
2022 అభ్యర్థులతోపాటు కొత్తవారికి కూడా అవకాశం ఇచ్చారు. దీంతో దరఖాస్తుల సంఖ్య 4.03 లక్షలకు పెరిగింది. వీరిలో దాదాపు 80 శాతం మంది వరకూ పరీక్షకు హాజరయ్యే అవకాశముందని అంచనా.
JEE Advanced 2024 Exam: ప్రశాంతంగా ముగిసిన జేఈఈ మెయిన్ అడ్వాన్స్‌డ్
గత రెండు ప్రిలిమ్స్.. ప్రశ్నలు ఇలా
ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు గత ప్రశ్నల శైలిని విశ్లేషించి ఎగ్జామినర్ అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న పరిజ్ఞానంపై అవగాహన ఏర్పరచుకోవాలి. గత రెండు ప్రిలిమ్స్‌లో అడిగిన ప్రశ్నలు.. ఆయా అంశాలపై అన్ని కోణాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ఉన్నాయి. ఆయా అంశాలను క్షుణ్నంగా, అన్వయ దృక్పథంతో విశ్లేషణాత్మకంగా చదివినప్పుడే సరైన సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్‌ల నుంచి అడిగిన ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉన్నాయి. అదే విధంగా జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలపై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. వివిధ ఇండెక్స్‌లపై ప్రశ్నలు ఎదురయ్యాయి. కాబట్టి అభ్యర్థులు కోర్ టాపిక్స్‌ను కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేస్తూ.. అన్ని కోణాల్లో విషయావగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలు, ప్రభుత్వ పథకాలు–విధానాలు, ముఖ్యమైన ఇండెక్స్‌లను అధ్యయనం చేయాలి.
Admissions at SVVU: ఎస్‌వీవీయూలో ఎంవీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
రివిజన్ ప్రధానంగా
తుది దశ ప్రిపరేషన్‌లో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రివిజన్ శాస్త్రీయ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సొంతంగా రూపొందించుకున్న షార్ట్ నోట్స్, సినాప్సిస్‌లపై దృష్టిపెట్టాలి. సినాప్సిస్‌ను చదివితే ఆ టాపిక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మదిలో మెదిలేలా ఉండాలి. ఇప్పటికే రాసుకున్న సొంత నోట్స్‌ను ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. అదేవిధంగా ప్రస్తుతం తాము చదివిన మెటీరియల్‌లోనే ఆయా అంశాలకు సంబంధించిన సబ్ హెడ్డింగ్స్‌ను, ముఖ్యమైన పాయింట్స్‌ను తరచూ చూసుకోవడం ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.
ప్రాక్టీస్ టెస్ట్స్
ప్రస్తుత సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థులకు రివిజన్‌తోపాటు ఉపకరించే మరో వ్యూహం.. ప్రాక్టీస్ టెస్ట్స్‌కు హాజరు కావడం. రివిజన్‌తోపాటు ప్రతిరోజు మోడల్ పేపర్లు సాధన చేయడం, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది. ప్రాక్టీస్ టెస్ట్‌లు రావడం ద్వారా ఎక్కడ బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది. తద్వారా సదరు టాపిక్స్‌ను ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రాక్టీస్ టెస్టుల ద్వారా పరీక్ష హాల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. ఫలితంగా ఎగ్జామ్ డే టెన్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
SVVU Ph. D Admissions: ఎస్‌వీవీయూలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు..
పరీక్షకు ముందు రోజు
పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని(హాల్ టికెట్ వంటివి) సిద్ధం చేసుకోవాలి. పోటీ నేపథ్యంలో చివరి నిమిషం వరకు చదవాలనే తపన ఉండటం సహజం. కాని దీనివల్ల మానసిక ఒత్తిడి, శారీరక అలసటకు గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి.
హాల్ టికెట్ డౌన్‌లోడ్
ప్రిలిమ్స్ అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. సమయం ఉంది కదా.. అని చివరి రోజు వరకు వేచి చూడటం సరికాదు. హాల్ టికెట్‌ను వీలైనంత ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవడం మేలు. దీనివల్ల చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు, సాంకేతిక సమస్యలు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా హాల్‌టికెట్‌లో ఏమైనా పొరపాట్లు ఉంటే..పరీక్ష కేంద్రంలోని అధీకృత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్పులు చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇలా మార్పులు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడిన అభ్యర్థులు తప్పనిసరిగా తమ గుర్తింపును రుజువు చేసే విధంగా ఏదైనా అధికారిక గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Government Schools: ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతోన్న విద్యార్థుల చేరికలు..‘బడిబాట’కు శ్రీకారం
ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్
అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ నింపడంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓఎంఆర్ షీట్‌ను తప్పులు లేకుండా నింపడం చాలా ముఖ్యం. ఓఎంఆర్ షీట్‌ను పూర్తి చేయడంలో పొరపాట్లు చేసి ఎంతోమంది అవకాశాలు చేజార్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అదేవిధంగా సమాధానాలు బబ్లింగ్ చేసే క్రమంలో.. ప్రశ్న సంఖ్య, ఆప్షన్‌ను క్షుణ్నంగా గుర్తించాలి.
పరీక్ష రోజు.. ప్రతిభ చూపేలా
పరీక్ష రోజు రెండున్నర గంటల సమయంలో చూపే ప్రతిభ విజయాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి పరీక్ష హాల్లో ప్రత్యేక వ్యూహాలను అనుసరించాలి. ముందుగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత తమకు సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వాలి. అనంతరం ఓ మోస్తరు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించాలతి. చివరగా తమకు అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. దీనికి భిన్నంగా ముందు తమకు అవగాహన లేని ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు ఉపక్రమిస్తే.. సమయం వృధా కావడమే కాకుండా.. సమాధానాలు స్ఫురించక.. ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. పర్యవసానంగా తమకు తెలిసిన ప్రశ్నలకు కూడా సమాధానం గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
Ph.D Admissions: నూతన విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
చివరగానే ఆ టెక్నిక్
పోటీ పరీక్షల్లో.. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే పరీక్షల్లో అభ్యర్థులు ఎలిమినేషన్ టెక్నిక్‌ను అనుసరిస్తారు. అంటే.. నాలుగు సమాధానాల్లో.. ప్రశ్నకు సరితూగని సమాధానాలను ఒక్కొక్కటిగా తొలగించి.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను సమాధానంగా భావించడం. ఈ టెక్నిక్‌ను పరీక్ష చివరి దశలోనే అమలు చేయాలి. అప్పటికే తమకు సమాధానాలు తెలిసిన అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకున్నామని భావించాకే ఎలిమినేషన్ లేదా గెస్సింగ్‌పై దృష్టి పెట్టాలి.
ముఖ్య సమాచారం
- జూన్ 9న గ్రూప్–1 ప్రిలిమ్స్
- 150 ప్రశ్నలు (150 మార్కులు)తో ప్రిలిమ్స్
- పరీక్షకు వారం ముందు నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం
- అక్టోబర్ 21 నుంచి మెయిన్ పరీక్షలు
- వెబ్‌సైట్: https://www.tspsc.gov.in
ప్రిలిమ్స్.. ఎగ్జామ్ డే టిప్స్
- ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి.
- సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా, తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
- ఎలిమినేషన్ టెక్నిక్‌ను చివరిగా అనుసరించడం మేలు.
- ఓఎంఆర్ షీట్ నింపడంలో అప్రమత్తంగా వ్యవహరించాలి
- పరీక్ష సమయానికి కనీసం గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
Kendriya Vidhyalayam: నూతన విద్యా సంవత్సరంలో విద్యాలయం ప్రారంభం..
Tags
- TGPSC Group 1
- exam preparations
- prelims exam tips
- TGPSC Group 1 Prelims Exam
- prelims updates
- revision for prelims exam
- TGPSC Group 1 Prelims Hallticket
- Education News
- Examination strategy
- expert advice
- Civil candidates
- Group-1
- Prelims
- Applications
- Preparation Tips
- Exam Strategies
- Past attempts
- qualifying cut-off
- sakshieducation News