Free Group 1 Coaching: ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రూప్–1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్శిలు) పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు వీలుగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను మార్చి 5న ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్హులైన మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉచిత శిక్షణను 45 రోజుల పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే అందించనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఆసక్తి ఉన్న అభ్యర్థులు హనుమకొండ సుబేదారిలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని కార్యాలయంలో ఈనెల 22 తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 7330990322 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Published date : 06 Mar 2024 11:28AM