Skip to main content

India vs Australia, 1st Test: భారత్‌ చేతిలో ఆసిస్‌ చిత్తు... భారీ ఓటమి

బోర్డర్‌గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 321/7 (తొలి ఇన్నింగ్స్‌) ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 79 పరుగులు జోడించి 400 పరుగులకు ఆలౌటైంది.
Rohit Sharma

ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసిస్‌ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే చాపచుట్టేసింది.  
అదరగొట్టిన అశ్విన్‌...
తొలి ఇన్నింగ్స్‌లో (3/42)తో ఆకట్టుకున్న అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో (5/37).. తన స్పిన్‌ మాయాజాలంతో ఆసీస్‌ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో (5/47)తో అదరగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు 16 వికెట్లు పడగొట్టారు.
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జడేజా...
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతోపాటు 70 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రోహిత్‌ శర్మ (120; 212), అక్షర్‌ పటేల్‌ (84) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో మొత్తం నాలుగు టెస్ట్‌లలో 1–0 ఆధిక్యాన్ని భారత్‌ ప్రదర్శిస్తోంది.

Published date : 11 Feb 2023 03:56PM

Photo Stories