Gangster as Terrorist: ఈ గ్యాంగ్‌స్టర్‌ని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం..!
Sakshi Education

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు.
World's Richest Woman: ఈమె ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు.. ‘లో రియాల్’ వైస్ ప్రెసిడెంట్ రికార్డు..!
పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
Published date : 02 Jan 2024 11:42AM