Skip to main content

Train Journey: రైలు కదిలేముందు జర్క్‌ ఎందుకు?

భారతదేశంలో దాదాపు 125 కోట్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది దూర ప్రయాణాలకు రైళ్లను ఆశ్రయిస్తుంటారు.
Train Journey jerks,Indian train travel,Indian railway journey with passengers onboard.
Train Journey jerks

అయితే కొన్ని రైళ్లు బయలుదేరేముందు ఒక కుదుపునకు గురి చేసి, ఆ తర్వాత ముందుకు కదలడాన్ని మీరు గమనించేవుంటారు. ఇది ప్రతి రైలులోనూ జరగదు. కొన్ని రైళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది. 

Longest trains: ప్రపంచంలోనే అతిపొడవైన స్విస్‌ ప్రయాణికుల రైలు

ఈ రైళ్లలోనే జర్క్‌ అనుభూతి

నిజానికి ఈ జర్క్‌కు కారణం రైలు కోచ్. కొన్ని రకాల కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే మనకు ఈ జర్క్‌ అనేది వస్తుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగిన రైళ్లలో ఇటువంటి జర్క్‌ మనకు అనుభవానికి వస్తుంది. ఈ తరహా కోచ్‌లలో ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే కప్లింగ్‌ల డిజైన్ చాలా పాతదై ఉంటుంది. దీంతో వాటి స్థాయి ఇటువంటి జర్క్‌లను నియంత్రించేందుకు అనువుగా ఉండదు. 

Largest District in India: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది?

వీటిలో తక్కువ జర్క్‌

ఐసీఎఫ్‌ కోచ్‌లు కలిగివున్న రైళ్లు వాటి కప్లింగ్‌లలో జర్క్‌ రెసిస్టెంట్ సస్పెన్షన్‌లను కలిగి ఉంటాయి. ఐసీఎఫ్‌ కోచ్‌లతో రైలు నడుస్తున్నప్పుడు చాలా స్వల్పస్థాయి జర్క్‌ మాత్రమే సంభవిస్తుంది. కప్లింగ్‌లు గుండ్రంగా ఉండి, రెండు కోచ్‌లు ఒకదానికొకటి అనుసంధానమయ్యే చోట ఉంటాయి.

World's largest cargo plane-Beluga Airbus: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం-బెలుగా ఎయిర్‌బస్‌

న్యూటన్ మొదటి నియమం..

న్యూటన్ మొదటి నియమం కూడా ఇటువంటి జర్క్‌కు కారణంగా నిలుస్తుంది. అదే జడత్వ నియమం. వాస్తవానికి మీరు రైలులో కూర్చున్నప్పుడు, మీ శరీరం స్థిరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రైలు అకస్మాత్తుగా ముందుకు కదులుతున్నప్పుడు.. మీ శరీరం దాని స్థానంలో అది ఉన్నప్పటికీ, రైలు కదలిక కారణంగా జర్క్‌ అయినట్లు అనుభూతి కలుగుతుంది.

Trees: అడవుల్లో అంతర్గత నెట్‌వర్క్‌.. చెట్లు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయా?

Published date : 25 Sep 2023 08:45AM

Photo Stories