World's largest cargo plane-Beluga Airbus: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం-బెలుగా ఎయిర్‌బస్
Sakshi Education
తిమింగలం ఆకారంలో ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ బస్ బెలుగా రవాణా వాణిజ్య సేవల కోసం తయారుచేయబడింది.
World's largest cargo plane-Beluga Airbus
ఎయిర్‌బస్ బెలూగా సైనిక, సముద్ర, అంతరిక్షం,ఎనర్జీ,ఏరోనాటిక్స్ సహా వివిధ రంగాలకు కార్గో సేవలను అందిస్తుంది. రష్యన్ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి.
బెలుగాను ఎయిర్‌బస్ సంస్థ తయారు చేస్తోంది. తొలి ఫ్లయిట్‌ను 1994లో తయారు చేసింది. 2010లో ఎయిర్‌బస్ బెలుగా XL పేరుతో భారీ విమానంను తయారు చేసింది. జనవరి 2020లో బెలూగా తొలిసారిగా ఎగిరింది.
బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి.
బెలుగా వివరాలు:
పొడవు - 56.16 మీటర్లు
ఎత్తు - 17.25 మీటర్లు
రెక్కల విస్తీర్ణం - 44.84 మీటర్లు
కెపాసిటీ: 47,000 కేజీలు
ఇంధన సామర్థ్యం: 23,860 లీటర్లు