Skip to main content

Even-Odd formula: సరి-బేసి ఫార్ములా తొలిసారిగా ఎక్కడ అమలయ్యిందో తెలుసా!

కాలుష్యం కాటుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్ జనం అతలాకుతలం అవుతున్నారు. గత కొద్దిరోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.
2016 Delhi Pollution Plan, Traffic Management for Cleaner Air,Even-Odd formula, Delhi Odd-Even Car Rule,Kejriwal's Pollution Solution,

దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ స్థితి నెలకొంది.  ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి ఫార్ములాను అమలు చేస్తోంది. దీపావళి అనంతరం ఢిల్లీలో సరి-బేసి ఫార్ములా అమలుకానుంది. అయితే ఈ విధమైన ఫార్ములా తొలిసారిగా ఎక్కడ అమలయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Air pollution in Delhi: దేశ రాజధానిలో ప్రమాదక స్థాయిలో వాయు కాలుష్యం

ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం 2016లో బేసి-సరి ఫార్ములాను అమలు చేసింది. ఆ సమయంలో ఈ విధానం అందరికీ కొత్తగా అనిపించింది. చాలామందికి దీని గురించి అర్థం కాలేదు. ఈ ఫార్ములా ప్రకారం చివర బేసి సంఖ్య (3,5,7,9) ఉన్న వాహనాలు మాత్రమే బేసి సంఖ్యగల తేదీలలో నడుస్తాయి. సరి సంఖ్య గల వాహనాలు (2,4,6,8) రోడ్లపైకి రావడానికి సరిసంఖ్య గల తేదీలలోనే అనుమతి ఉంటుంది.

2016లో ఢిల్లీలో అమలు చేసిన ఈ ఫార్ములాను తొలిసారిగా మెక్సికోలో ప్రవేశపెట్టారు. దీనికి ‘హోయ్ నో సర్కులా’ అనే పేరు పెట్టారు. దీని అర్థం ‘మీ కారు ఈరోజు నడవదు’. అనంతర కాలంలో ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటువంటి విధానాలను అమలు చేశారు. బీజింగ్, బ్రెజిల్, కొలంబియా, పారిస్ తదితర ప్రాంతాల్లో సరి-బేసి విధానానికి సంబంధించిన నిబంధనలు అమలయ్యాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఢిల్లీలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది.

GRAP-III in Delhi: గ్రాప్‌- 3 అంటే ఏమిటి? ఢిల్లీ ‍ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?

Published date : 08 Nov 2023 01:46PM

Photo Stories