Skip to main content

Air pollution in Delhi: దేశ రాజధానిలో ప్రమాదక స్థాయిలో వాయు కాలుష్యం

దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని ముంద్ఖా ప్రాంతంలో గురువారం గాలినాణ్యతా ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి.
Delhi records season's worst air pollution

నాణ్యతా ప్రమాణాల సూచీలో అత్యధికంగా 616 పాయింట్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉష్ణోగ్రత అత్యధికంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది.

Red light on, Gaadi off in Delhi: ఢిల్లీలో కాలుష్య విముక్తికి ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రాత్రి 7 గంటలకు 357 వద్ద నమోదైంది. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 

గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు, 50-100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101-200 ఉంటే మధ్యస్థంగా, 201-300 పేలవంగా ఉన్నట్లు గణిస్తారు. 301-400 ఉంటే అత్యంత పేలవంగా, 401-500 ఉంటే తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు భావిస్తారు. 

India, Bangladesh New projects: భారత్,బంగ్లాదేశ్‌ల మ‌ధ్య‌ పలు ప్రాజెక్టులకు శ్రీకారం

Published date : 02 Nov 2023 06:41PM

Photo Stories