Skip to main content

Flag of Israel: జెండాపై ఉన్న అస‌లు చరిత్ర‌.. న‌క్ష‌త్రం వెనుక క‌థ‌..!

ఇజ్రాయిల్ జెండాపై ఉన్న ఈ న‌క్ష‌త్రం గురించి చాలా మందికి తెలీదు. దీని వెనుక చ‌రిత్ర కొన్ని సంవ‌త్స‌రాల కింద‌టిది. ఈ ర‌హ‌స్యం గురించి క్రింది క‌థ‌నంలో తెలుసుకుందాం..
Flag of Israel,Hidden History,Israel's National Emblem,Israeli Identity
Flag of Israel

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్‌తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది.

Neeraj Chopra Nominated for 2023 World Athlete of the Year Award

ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు.

PM confirms India’s bid to host 2036 Olympics

భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్‌ పట్టుకున్న డాలు అని చెబుతారు.

Published date : 17 Oct 2023 11:35AM

Photo Stories