Skip to main content

పోటీపరీక్షలకు సంబంధించి డేటా ఇంటర్‌ప్రిటేషన్ (డీఐ) అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?

- ఎస్.దీప, విశాఖపట్నం
Question
పోటీపరీక్షలకు సంబంధించి డేటా ఇంటర్‌ప్రిటేషన్ (డీఐ) అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
పోటీపరీక్షల ఔత్సాహికుల్లోని విశ్లేషణ నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టాబ్యులర్, లైన్‌చార్ట్, బార్‌చార్ట్, పైచార్ట్ తదితరాల రూపంలో ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు వీలైనన్ని మోడల్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ విభాగంపై పట్టుసాధించవచ్చు. డీఐ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం గుర్తించాలంటే ఇచ్చిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విభాగంలో వస్తున్న ప్రశ్నలు మధ్యస్థం నుంచి అధిక కాఠిన్యత కలిగి ఉంటున్నాయి. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాల్సి ఉంటుంది. వేగంగా క్యాలిక్యులేషన్స్ చేయడాన్ని అలవరచుకోవాలి. కచ్చితత్వం కూడా ముఖ్యమే. యావరేజెస్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియో తదితరాలకు సంబంధించిన సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
 
డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్:

ఎలాంటి అకడమిక్ పరిజ్ఞానం అవసరం లేకుండా.. సమయస్ఫూర్తి, స్వీయ వివేచనతో సమాధానాలివ్వాల్సిన ప్రశ్నలు ఎదురయ్యే విభాగం డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక సంఘటన/సందర్భం/ సమస్యను పేర్కొని, దానికి సంబంధించి ఒక అధికారిగా ఎలా వ్యవహరిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనే తరహా ప్రశ్నలు ఈ విభాగంలో ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన అవసరం లేకపోయినా.. వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న సమస్యలు - వాటికి అధికారులు తీసుకున్న నిర్ణయాలు - ఫలితాలు వంటి వాటిని విశ్లేషించడం ద్వారా నైపుణ్యం లభిస్తుంది.

Photo Stories