Skip to main content

NEET PG Exam 2022: నీట్‌ పరీక్ష వాయిదా

NEET PG Exam 2022: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ పీజీ) పరీక్ష-2022ను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. 6-8 వారాల పాటు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం(ఫిబ్రవరి 4) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం 2022, మార్చి 12న నీట్‌ పరీక్ష జరగాల్సి ఉంది. నీట్ పీజీ పరీక్ష-2022ని వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 24న సుప్రీం కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే అంతకు ముందే నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

NEET MDS 2022: దంత వైద్యంలో.. మాస్టర్స్‌

Published date : 04 Feb 2022 11:58AM

Photo Stories