RGUKT: ఆర్జీయూకేటీ కౌన్సెలింగ్
Sakshi Education
2021–22 విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీ ప్రవేశానికి నవంబర్ 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్‌లోని ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డిసెంబర్ 2 వరకు ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు, విద్యార్థులకు ర్యాంక్‌లవారీగా షెడ్యూల్ విడుదలచేసి కాల్ లెటర్స్, మెయిల్స్ ద్వారా సమాచారం అందించామన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్సు డిపోల నుంచి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్‌కే వ్యాలీ, నూజివీడు ట్రిపుల్ ఐటీలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు సుముఖత తెలిపారన్నారు.
చదవండి:
RGUKT Admissions: ఆర్‌జీయూకేటీ బాసరలో మాస్టర్స్ ప్రోగ్రామ్
Andhra Pradesh Jobs: ఏపీ ఆర్‌జీయూకేటీల్లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Published date : 23 Nov 2021 01:34PM