TS PECET: టీఎస్ పీఈసెట్ షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఇదే..
ఇందుకు సం బంధించిన సమగ్ర నోటిఫికేషన్ ఏప్రిల్ 11న విడుద లవుతుందని, అదే రోజునుంచి ఆన్ లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో మండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, వైస్‌చాన్స్ లర్లు ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా, ప్రొఫెసర్ తాటికొండ రమేష్, ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, పీఈ సెట్ కన్వీనర్ ప్రొఫె సర్ సత్యనారా యణ పాల్గొన్నారు. ఈ ఏడాది పీఈ సెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించనుండగా, కన్వీనర్‌గా ప్రొఫెసర్ సత్యనారాయణను గతంలోనే నియమించారు. ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతర అభ్యర్థులు రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలని, ఇతర వివరాల కోసం https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
చదవండి: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..పరీక్షల తేదీలు ఇవే
నోటిఫికేషన్ విడుదల |
11–4–22 |
ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ |
11–4–22 |
దరఖాస్తులకు తుది గడువు |
18–6–22 |
రూ. 500 అపరాధ రుసుముతో |
13–7–22 |
రూ.2 వేల అపరాధ రుసుముతో |
20–7–22 |
రూ. 5 వేల అపరాధ రుసుముతో |
27–7–22 |
హాల్‌టికెట్ల డౌన్ లోడింగ్
అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసిన వారు |
8–8–22 |
అపరాధ రుసుముతో దరఖాస్తు చేసినవారు |
13–8–22 |
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లు |
22–8–22 |
(నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో) |
|
ఫలితాలు |
టెస్ట్‌లు ముగిసిన వారం రోజుల్లో |