PGECET: పీజీసెట్‌కు 41,472 దరఖాస్తులు
Sakshi Education
రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఏపీపీజీసెట్–2021కి 41,472 దరఖాస్తులు వచ్చాయి.
రూ.500 ఫైన్ తో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 8న చివరి రోజు. మొత్తం 145 కోర్సుల్లో కార్పొరేట్ తెలుగు, నానోటెక్నాలజీ (లేటరల్ æఎంట్రీ), భరతనాట్యం, ద్రవిడన్ లిటరేచర్, కన్నడ లిటరేచర్, సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ కోర్సులకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదని ఏపీపీజీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వై.నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. మొత్తం 43,632 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అక్టోబర్ 22 నుంచి 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కో జిల్లా కేంద్రంలో ఒక్కొక్క పరీక్ష కేంద్రం, హైదరాబాద్‌లో ఒకటి కలిపి మొత్తం 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చదవండి:
భారీ సంఖ్యలో ఐబీపీఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం
Published date : 08 Oct 2021 01:24PM